Thursday, May 2, 2024

నందిగామ వద్ద భారీ వరద… హైదరాబాద్ టూ విజయవాడ రాకపోకలు బంద్

- Advertisement -
- Advertisement -

అమరావతి: గత ఐదు రోజులు నుంచి ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఎన్‌టిఆర్ జిల్లా నందిగామ మండలం కీసర గ్రామం వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను కీసర గ్రామం వద్ద నిలిపివేయడం ఇతర రూట్లలో ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ప్రయాణికులు జాతీయ రహదారి 65పై రాకపోకలను నిలిపివేశామని ఎన్‌టిఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

Also Read: జంపన్నవాగులో ఏడుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేవారు: హైదరాబాద్-నార్కట్‌పల్లి- మిర్యాలగూడ- దాచేపల్లి- గుంటూరు- పిడుగురాళ్ల- సత్తెనపల్లి- గుంటూరు- విజయవాడ- ఏలూరు-రాజమండ్రి- విశాఖపట్నం వెళ్లాలని సూచించారు.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లేవారు: విశాఖపట్నం-రాజమండ్రి-ఏలూరు-విజయవాడ-గుంటూరు-సత్తెనపల్లి-పిడుగురాళ్ల-దాచేపల్లి-మిర్యాలగూడ-నార్కట్‌పల్లి-హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. వాహనదారులు తమ ప్రయాణాలను పైన తెలిపిన మార్పులను గమినించాలని విజ్ఞప్తిచేశారు. సహాయం కావాలనుకున్నవారు 7328909090కు ఫోన్ చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News