Monday, October 14, 2024

విషాద ఘటన.. పారాగ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ టూరిస్ట్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌కు చెందిన 26ఏళ్ల ఓ మహిళా టూరిస్టు పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది. ఈ విషాద సంఘటన హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం కులూ పర్యాటక ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేసిన కులూ పోలీసులు.. సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకుండానే పారాగ్లైడింగ్ కు అనుమతివ్వడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించి పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ 336, 334 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన టూరిస్టు పూర్తి వివరాలు వెల్లడించలేదు.

ఈ ప్రమాదంపై కులూ పర్యాటక శాఖ అధికారిణి సునైనా శర్మ స్పందిస్తూ.. మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. పారాగ్లైడింగ్ చేసిన ప్రదేశం, ఎక్విప్‌మెంట్‌కు, పైలట్‌కు అనుమతి ఉందని.. ఘటన సమయంలో ఎలాంటి వాతావరణ సమస్యలు కూడా లేవని.. పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News