Wednesday, May 15, 2024

చావంటే నాకు భయం లేదు

- Advertisement -
- Advertisement -

I don't want Z category security: MP Asaduddin

నాకు జెడ్ కేటగిరీ భద్రత అక్కర్లేదు : లోక్‌సభలో ఎంపి అసదుద్దీన్

మన తెలంగాణ/హైదరాబాద్ : బ్యాలెట్‌పై నమ్మకం లేకుండా బుల్లెట్‌పై నమ్మకం పెట్టుకుని తన కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన వారు ఎవరంటూ లోక్‌సభలో మజ్లిస్ పార్టీ చీఫ్, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. తాను చావుకు భయపడటం లేదని, తనకు ‘జడ్’ కేటగిరీ సెక్యూరిటీ అవసరం లేదన్నారు. సామాన్య పౌరుడిలా ఏ కేటగిరిలో వుంటానని, కాల్పులు జరిపిన వారిని శిక్షించాలని అసదుద్దీన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు. సోమవారం లోక్‌సభలో అమిత్‌షా దీనిపై ప్రకటన చేస్తారని పియూష్ గోయల్ వెల్లడించారు. కాగా, అసద్‌పై గురువారం ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు జరిగిన సంగతి విదితమే. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన ప్రచారానికి వెళ్లారు. హాపూర్‌లో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. హాపూర్ కోర్టులో వీరిద్దరిని హాజరు పరిచి కస్టడీలోకి తీసుకోవడానికి న్యాయస్థానాన్ని కోరుతామని యూపి ఏడిజి ప్రశాంత్‌కుమార్ తెలిపారు. అయితే ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నదని వివరించారు. అసద్‌పై కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు సచిన్, శుభమ్‌లను అరెస్టు చేశారు. వీరిద్దరి గురించిన విషయాలు ఆసక్తికంగా ఉన్నాయి. వీరిద్దరికి గతంలో నేరచరిత్ర ఏమీ లేదు. కానీ ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు, ఇందులో ఒకరు సోషల్ మీడియాలో ద్వేషపు పోస్టులు పెట్టినట్లు సమాచారం. నిందితుడు సచిన్ నోయిడాలోని బాదల్‌పుర్ నివాసి. ఎల్‌ఎల్‌ఎం చేసినట్లు చెప్పారని పోలీసులు వివరించారు. సచిన్ అరెస్టు తర్వాత పోలీసులు ఆయన కుటుంబాన్ని కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు విచారించారు. సచిన్ తండ్రి వినోద్ 20 నుంచి 25 కంపెనీలకు లేబర్లను అందించే పనిచేస్తుంటాడు. సచిన్ కూడా అందులో తోడుగా పనిచేస్తుంటాడని వివరించారు. గురువారం ఉదయం 8గంటల ప్రాంతంలో సచిన్ ఇల్లు విడిచి బయటకు వెళ్లాడని, ఓ కంపెనీ పని మీదనే బయటకు వెళ్తున్నట్లు చెప్పాడని తెలిపాడు. ఎందుకో తెలియదు కానీ, రెండు మూడు రోజులుగా తన కొడుకు అప్‌సెట్ అయ్యాడని పేర్కొన్నాడు.

సహరన్‌పూర్‌కు చెందిన సంప్లా బేగంపర్ వాసి శుభయ్. అతడి తల్లిదండ్రులు మరణించారు. సోదరికి పెళ్లి అయింది. పదో తరగతి పాస్ అయిన శుభమ్ సాగు సంబంధ పనులు చేసుకుంటుంటాడు. ఎక్కువ సొంతూరులో ఉండడు. గజియాబాద్‌లోని మోదిపురంలో ఉంటాడని స్థానికులు తెలిపారు. అయితే విచారణలో వీరిద్దరూ అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ చేసే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిపారని పోలీసువర్గాలు వివరించాయి. సోషల్ మీడియాలో ఒవైసీ స్పీచ్‌లను వారు వింటూ ఉంటారని తెలిపారు. అయోధ్య రామమందిరం, రామజన్మభూమి వివాదంపై ఒవైసీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు వారిద్దరూ పేర్కొనట్లు వివరించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి ఒవైసీ వస్తున్నట్లు తమకు తెలిసిందని, అక్కడే ఆయన అంతు చూడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News