Thursday, May 2, 2024

ప్రజలతో మమేకమైన జీవనం నాది

- Advertisement -
- Advertisement -

మరిపెడ: ప్రజల చేత, ప్రజల కోసం అన్న మాట మేరకు ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ ఉంటూ ప్రభుత్వం నుంచి ప్రజలకి అన్ని పథకాలు అందిస్తున్నామని.. ఎన్నో ఏళ్లుగా ప్రజలతో కలిసి ఉంటూ వారితో మమేకమయ్యానని, 42 ఏళ్లుగా డోర్నకల్ ప్రజలకు సేవలందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తనకు మాత్రమే నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు ఉందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం యలమంచితండా, ఆనెపురం, వెంకట్యాతండా, స్టేజీతండా గ్రామ పంచాయితీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావుతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ముందుగా ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలు, నృత్యాలు, డ్యాన్స్‌లతో పూలు చల్లుకుంటూ ఘన స్వాగతం పలికారు. అనంతరం యలమంచితండా సర్పంచ్ బానోతు పార్వతీ మంగీలాల్, ఆనెపురం సర్పంచ్ దామెర్ల వీరన్న, వెంకట్యాతండా సర్పంచ్ గుగులోతు సూర్యనాయక్, స్టేజితండా సర్పంచ్ జాటోతు భీమానాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమవేశంలో ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ సారథ్యంలో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, సిఎం కెసిఆర్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు దేశం గర్వించేలా అన్ని రంగాల్లో పురోగమించిదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని తెలిపారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని రైతులు, పేదలు రెండు కళ్లుగా సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. నిరుపేదలకు అహార భద్రత కల్పించి, అభాగ్యులకు కొండంత అండగా ఆసరా కల్పిస్తూ, పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, పేద విద్యార్ధులకు కేజీ టూ పిజీలో భాగంగా గురుకులాల ఏర్పాటు, రైతులకు రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్, అనేక ప్రాజెక్టులను నిర్మించి పుష్కలమైన సాగునీరు, మాతాశిశు సంరక్షణే లక్షంగా కెసిఆర్ కిట్లు ఎలా ఎన్నో సంక్షేమ పథకాలను కెసిఆర్ ప్రభుత్వం అందించి భరోసా కల్పిస్తుందన్నారు.

సిఎం కెసిఆర్ పాలనలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలోనే సకల జనుల పెన్నిధిగా మారిందని తెలిపారు. నాటి నేటి పరిస్ధితులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని, ప్రజలు అభివృద్ధిని గమనించాలని కోరారు. ముచ్చటగా మూడోసారి సిఎంగా కెసిఆర్ గెలుపొందడం ఖాయమన్నారు.ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అర్హులైన వారికి ఇళ్లు, దళిత బంధు ఇస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు కుడితి మహేందర్‌రెడ్డి, గుగులోతు వెంకన్న, అయూబ్‌పాషా, ఎంపిటిసి గుగులోతు చిట్టి అమర్‌సింగ్, నాయకులు కవులూరి హరిష్‌బాబు, లాల్‌సింగ్, అమర్‌సింగ్, గంధసిరి కృష్ణ, బానోతు భద్రునాయక్, బానోతు ప్రవీణ్‌నాయక్, మంద వెంకన్న, శ్రీనివాస్, మగ్బూల్ ఖాన్, రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు దామ్లానాయక్, చంద్రునాయక్, తహశీల్ధార్ పిల్లి రాంప్రసాద్, ఎంపిఓ పూర్ణచందర్‌రెడ్డి, మిషన్ భగీరథ ఏఈ రాకేష్, ఆర్‌డబ్లూఎస్ ఏఈ ప్రదీప్, ఉప సర్పంచ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News