Thursday, May 2, 2024

రెరా చైర్మన్‌గా సత్యనారాయణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి సత్యనారాయణను నియమించింది. దీనికి సంబంధించి 85 జీఓను సోమవారం విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను పురపాలక శాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ జారీ చేశారు. సత్యనారాయణ ప్రస్తుతం పురపాలక శాఖ సంచాలకుడిగా కొనసాగుతున్నారు. రెరా చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంత అదనపు కమిషనర్ జె.లక్ష్మీనారాయణ, పట్టణ ప్రణాళిక విశ్రాంత సంచాలకుడు కె.శ్రీనివాసరావులను నియామకం చేసింది. వీరు ఈ పదవుల్లో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా ఇప్పటి వరకు రెరా చైర్మన్ బాధ్యతలను సిఎస్ శాంతికుమారి పర్యవేక్షించారు.
రియల్‌వర్గాల్లో సంతోషం
ఐఏఎస్ అధికారుల్లో సౌమ్యుడిగా మంచి పేరున్న ఆయన నియమాకం మెరుగయ్యిందని హైదరాబాద్ రియల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రాజేశ్వర్ తివారీ పదవీ విరమణ తర్వాత రెరా చైర్మన్‌గా సోమేష్ కుమార్ కొంతకాలం వ్యవహారించారు. ఆతర్వాత ప్రస్తుత సిఎస్ శాంతికుమారి అదనపు బాధ్యతలను చేపట్టారు. తాజాగా రెరా చైర్మన్‌గా డా.ఎన్ సత్యనారాయణను నియమించడంతో రియల్‌వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
సత్యనారాయణ బయోడేటా
స్వస్థలం: ఖమ్మం జిల్లా కిష్టారం, 01.07.1963లో ఈయన జన్మించారు.
తండ్రిపేరు: రామయ్య
ప్రస్తుతం పనిచేసే సంస్థ: పురపాలక శాఖ డైరెక్టర్
చదువు: ఎంఎస్సీ (జువాలజీ) ఉస్మానియా యూనివర్శిటీ. ఇదే యూనివర్శిటీ నుంచి ఆయన ఎల్‌ఎల్‌బిని సైతం పూర్తి చేశారు.
వృత్తి: 25 సంవత్సరాలుగా పలు విభాగాల్లో (రెవెన్యూ శాఖలో జేసిగా, పురపాలక శాఖలో) వివిధ హోదాల్లో కీలక బాధ్యతలను ఆయన నిర్వర్తించారు.
పురపాలక శాఖలో ఆయన 3 సంవత్సరాలుగా 5 నెలలుగా పనిచేస్తున్నారు.
పురపాలక శాఖలో ఆయన చేసిన కృషికి గాను కేంద్రంతో పాటు రాష్ట్ర నుంచి పలు అవార్డులు ఆ శాఖకు (స్వచ్ఛ సర్వేక్షన్‌తో పాటు సపాయిమిత్ర తదితర) వరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News