ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ ఈ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. భారత్, శ్రీలంకలు కలిసి సంయుక్తగా ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో విజయం సాధించి.. ట్రోఫీని అందుకోవాలని టీం ఇండియా పట్టుదలతో ఉంది. అయితే టోర్నమెంట్‌కి ముందు భారత క్రికెట్ ప్లేయర్లలో జోష్ పెంచడానికి ఓ ప్రత్యేక పాటను విడుదల చేశారు. ‘BringItHome’ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గాయనీ శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal) ఆలపించారు. ఈ పాటను ఐసిసి విడుదల చేసింది.
దృఢ సంకల్పం, ఐక్యత, పట్టుదల, మహిళ క్రికెట్ వృద్ధిని తెలియజేసేలా ఈ పాటలో సాహిత్యం ఉంది. ‘‘ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్‌లో నేనూ భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఈవెంట్ సాంగ్‌ను ఆలపించడం సంతోషం కలిగిస్తుంది. వా వాయిస్‌ను వినిపించడం గౌరవంగా భావిస్తున్నా. అభిమానుల్లో స్పూర్తి నింపుతుందని అనుకుంటున్నా. ఈ టోర్నీలో ప్రతి క్షణం జ్ఞాపకంగా మిగిలిపోవాలని కోరుకుంటున్నా’’ అని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) పేర్కొన్నారు.
Also Read : అఫ్ఘాన్ ఇంటికి… లంక, బంగ్లా సూపర్-4కు