Saturday, April 27, 2024

పర్యావరణానికి మట్టి వినాయకుడు

- Advertisement -
- Advertisement -

Importance of Eco-friendly Ganesh Idols

దేవుడికి అలసట అంటూ ఒకటి ఉండదేమో! ఎలా కొలిచినా తనవాణ్ని చేసేసుకుంటాడు. ఇక విఘ్నాలను తొలగించే దేవుడిగా పేరున్న వినాయకుడికైతే ఏటా పెద్ద ఉత్సవమే నిర్వహిస్తాం. ఇంట్లో చిన్న వినాయకుణ్ని పెట్టుకుంటాం. వీధిలో పదడుగులు ఉంటుంది ఒక విగ్రహం. ఓ ఊర్లో యాభై అడుగులు ఉంటుంది ఇంకో విగ్రహం. ఎలా కొలిచినా సరే కదా అని చెప్పి రకరకాల రంగులు వాడేస్తు న్నాం. విగ్రహం తయారీకి ఏవేవో కృత్రిమ పదార్థాలు వాడేస్తున్నాం. అవన్నీ నిమజ్జనం రోజున చెరువుల్లో, నదుల్లో మునిగిపోయి ప్రకృతిని పాడు చేస్తున్నాయి. విఘ్నాలను తొలగించే దేవుణ్ని కొలిచేందుకు ప్రకృతికి ఎన్ని విఘ్నాలు కలిగిస్తున్నాం? అందుకే ఇప్పటికైనా ఎకో ఫ్రెం డ్లీ (పర్యావరణహిత) మా ర్గానికి వెళ్దాం. మట్టి వినాయకుడినే అం దరం పూజిద్దాం. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే వినాయకుడికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజున మొదలయ్యే ఈ ఉత్సవాన్ని ఏటా తొమ్మిది నుంచి 21రోజుల పాటు జరుపుతు న్నాం. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించడం మొ దలు పెట్టాడు. ఆయన మరణం తర్వాత ఈ వేడు క మళ్లీ ఇంటివరకే చేసుకునే పండుగగానే మిగిలిపోయింది. 1880వ దశకం లో,బ్రిటిష్ పాలన జరుగుతున్న రోజుల్లో లోకమాన్య బాలగంగాధర తిలక్ నేతృత్వం లో వినాయక చవితి ఉత్సవాలను మరోసారి పెద్ద ఎత్తు న నిర్వహించడం మొదలైంది. ఇక నాటినుంచి ఏటా వినాయక చవితి ఉత్సవాలు అదే స్థాయిలో జరుగుతూనే వస్తున్నాయి. మొదట్లో వినాయక చవితి ఉత్సవాలకు పూర్తిగా మట్టి విగ్రహాలనే తయారు చేసేవారు. ఆ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రాకతో విగ్రహాల తయారీల ఖర్చు ఊహించని స్థాయిలో తగ్గడం, సులువుగా, కలర్‌ఫుల్‌గా విగ్రహాలను తయారు చేసే అవకాశం దొరకడంతో దాదాపుగా సమాజమంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకే ఓటు వేస్తూ వచ్చిం ది. అయితే విగ్రహాల తయారీకి ఇలా వాడుతోన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కృత్రిమ రంగులు వినాయక నిమజ్జనం తర్వాత నీటిని కలుషితం చేస్తున్నాయని, పర్యావరణానికి హాని చేస్తున్నాయని చెబుతూ గత ఆరేడేళ్లుగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల వైపుకు సమాజం అడుగులేస్తోంది. ఏటా ఇదే విషయంపై ఎన్నో అవగాహనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నింటి ఫలితంగానే ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు. అలాంటి కొత్త వినాయకుడి విశేషాలు.

వినాయకుణ్ని పెంచుకుందాం…!
వినాయకుణ్ని తొమ్మిది రోజుల పాటు ఇష్టంగా కొలుస్తాం. పూజలు చేస్తాం. ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను పెడతాం. పదోరోజు భారీగా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేసి, కైలాసానికి సాగనంపుతాం. అక్కడితో మన పని అయిపోతుం ది. నిమజ్జనం జరిగాక కూడా ఆ దేవుడే చెట్టంతై మనతోనే ఉంటే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన వచ్చింది ౩౦ ఏళ్ల కొతూర్ దత్తాద్రికి. అనుకున్నదే తడవుగా ట్రీ వినాయకుణ్ని తయారు చేశాడు. ఎర్ర మట్టిలో కొన్ని రకాల విత్తనాలను కలిపి, ఆ మట్టితో చిన్న వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని ఓ కుండీలో పెట్టి పూజించుకున్నాడు. పదో రోజున దగ్గర్లో ఉన్న చెరువులో కాకుండా అదే కుండీలో నీళ్లు పోసి నిమజ్జనం చేశాడు. ఆ మట్టిలోని విత్తనం మొక్కగా మారింది. నిమజ్జనం తర్వాత కైలాసానికి వెళ్లిపోయినా, ఆ దేవుడింకా మొక్కలా అదే ఇంట్లో కొలువై ఉన్నాడు. వినాయకుణ్ని పెంచుకోవాలన్న దత్తాద్రికి వచ్చిన ఈ ఆలోచన అందరికీ నచ్చింది. ఫ్రెండ్లీ క్యాంపెయిన్‌లో భాగంగా గతేడాది చాలామంది ఈ పద్ధతిని ఎంచుకున్నారు. ఈ ఏడాది ట్రీ వినాయకుడికి మరింత క్రేజ్ పెరిగింది.

టేస్టీ వినాయకుడు
నిజంగానే తినే పదార్థాలతోనే ఈ వినాయకుణ్ణి తయారు చేస్తున్నారు. బిస్కెట్స్, బాదం, జీడిపప్పు, గోధుమపిండి, క్యాండీలు… ఇలా రకరకాల తినే పదార్థాలను వాడుకుంటూ అందంగా, ఆకర్షణీయంగా వినాయకుణ్ని తయారు చేయడం కూడా ఇప్పుడు బాగా కనిపిస్తోంది. కొంత శ్రమ, ఆసక్తి ఉంటే సొంతంగానే ఈ వినాయకుడిని తయారు చేసుకోవచ్చు.

లంబోదరుడికి నైవేద్యం…
వినాయక చవితి అనగానే గుర్తొచ్చేవి… తొమ్మిది లేదా పదకొండు రోజులు జరిగే పూజలు, పెట్టే రకరకాల ప్రసాదాలు. అలాగే పండుగరోజు ఇళ్లలో దేవుడికి పెట్టే నైవేద్యాలు. ఇవి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. కానీ ఉండ్రాళ్ల పాయసం, కుడుములు మాత్రం తప్పనిసరిగా చేస్తారు. అలాగే పులిహోర, శనగ గుగ్గిళ్లు కూడా ఉంటాయి. వీటితో పాటు వాళ్లవాళ్ల ఆచారాలను, ఇష్టాలను బట్టి స్వీట్లు, రకరకాల పిండి వంటలు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. తెలంగాణలో ప్రత్యేకంగా ఆ రోజు పెసరపప్పులో తుమ్మికూర, చింతకాయ వేసి పప్పు చేస్తారు. తుమ్మికూరంటే వినాయకుడికి బాగా ఇష్టమట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News