Friday, May 3, 2024

అమెరికా-చైనా అంతరాలు తొలగిస్తాం: ఇమ్రాన్ ఖాన్

- Advertisement -
- Advertisement -

Imran Khan comments on US-China

ఇస్లామాబాద్: ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న వార్తలను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. తమ దేశం ఏ రాజకీయ కూటమిలో చేరబోదని, అమెరికా-చైనా మధ్య ఏర్పడుతున్న అంతరాలను తొలగించే పాత్రను పోషించడానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. దక్షిణాసియాలో శాంతి, అభివృద్ధి అనే అంశంపై గురువారం నాడిక్కడ జరిగిన ఇస్లామాబాద్ కాంక్లేవ్-2021లో పాక్ ప్రధాని ప్రసంగిస్తూ ప్రచ్ఛన్న యుద్ధం, కూటముల ఏర్పాటు దిశగా పరిస్థితులు కదులుతున్నాయని చెప్పారు. తాము ఏ కూటమిలో భాగస్వామిగా ఉండబోమని, ఈ కారణంగానే కూటముల ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. గతంలో అగ్రరాజ్యాల మధ్య ఏర్పడిన శత్రుత్వంలో పాకిస్తాన్‌తోసహా ప్రపంచమంతా ఇబ్బందిపడిందని, మళ్లీ ఎటువంటి ఘర్షణ వాతావరణాన్ని తాము కోరుకోవడం లేదని ఆయన చెప్పారు.

Imran Khan comments on US-China

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News