Tuesday, April 30, 2024

శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ నెం. 1

- Advertisement -
  • సురక్షా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ * జిల్లా కేంద్రంలో పోలీసు వాహనాలతో భారీ ర్యాలీ
  • ఆకట్టుకున్న ఓపెన్ హౌజ్ * పాల్గొన్న జెడ్పి చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్
    వనపర్తి : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తున్నారని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సురక్షా దినోత్సవం నిర్వహించారు. వనపర్తి జిల్లా ఎస్పి రక్షిత కె. మూర్తి ఐ పిఎస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్ట ర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా జెడ్పి చైర్మెన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, అదనపు ఎస్పి షాకీర్ హుస్సేన్, డి ఎస్పి ఆనంద్ రెడ్డి, వనపర్తి టౌన్ సిఐ, కొత్తకోట సి ఐ, ఆత్మకూర్ సిఐ, వనపర్తి జిల్లా ఎస్సైలు, సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణ, మెరుగైన పోలీసింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు సమకూర్చిన పెట్రో కార్స్, బ్లూ కోల్డ్ వా హనాలతో పోలీస్ సిబ్బంది నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జెడ్పి చైర్మెన్ లోకనాథ్ రెడ్డి, కలెక్టర్, ఇతర అతిథులు జెండా ఊరి పాలిటెక్నిక్ కళాశాల నుంచి ర్యాలీని ప్రారంభించారు. పవన్ పిఎ స్, శంకర్ గంజ్, గాంధీ చౌక్, గాంధీ నగర్, అంబేద్కర్ చౌరస్తా, రాజీవ్ చౌరస్తా బస్ డిపో, రామాలయం, మర్రికుంట మీదుగా ర్యాలిగా తిరిగి పోలీ స్ హెడ్ క్వార్టర్స్‌కు చేరుకుంది. పోలీస్ వ్యవస్థ పనితీరు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉపయోగించే అధునాతన సాధనాలు, ఆయుధాల గురించి సవివరంగా తెలియజేసేందుకు వనపర్తి టౌన్ పిఎస్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమం అం దరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే శాంత్రి భద్రతలు నెలకొని ఉండడం ఎంతో అవసరమని అన్నారు. అప్పుడే పర్యాటకపరంగా పారిశ్రామికంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలు ఉంటుందన్నారు.
  • ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, సమకూరుస్తున్న అధునాతన వసతులతో తెల ంగాణ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు ని రంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ఫలితంగా తె లంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. నేటి సమాజంలో కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలు చోటు చేసుకుంటుండగా, అధునాతన సాంకేతిక పరిఙ్ఞానాన్ని వినియోగించుకుంటూ పోలీసులు సైతం నేరాల నియంత్రణకు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణలో పటిష్టమైన వ్యవస్థతో కూడిన కౌంట ర్ ఇంటెలిజెన్స్ విభాగం యావత్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని కలెక్టర్ అభినందించారు. అన్ని వర్గాల ప్రజలకు పూర్తి స్థాయిలో పోలీస్ శా ఖకు అధునాతన సదుపాయాలను సమకూరుస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఆయుధాలు, పె ట్రో కార్స్, బ్లూ కోల్డ్, జిల్లా స్థాయిలోనూ కమా ండ్ కంట్రోల్ స్టేషన్స్, షీ టీమ్స్, భరోసా సెంటర్లు వంటివి శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తున్నాయని అన్నారు. పోలీసు లు శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకు ండా హరితహారం వంటి ప్రభుత్వ ప్రాధాన్యత కా ర్యక్రమాల్లోనూ భాగస్వాములు అవుతున్నారని అ న్నారు. అనునిత్యం 24 గంటల పాటు విధి నిర్వహణలో నిమగ్నమై ఉంటూ పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని ప్రశంసించారు. జెడ్పి చై ర్మన్ మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని అన్నారు. కోవిడ్ సంక్షోభం సమయంలోనూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని అభినందించా రు.
  • తెలంగాణ రాష్ట్ర ప్రగతికి పోలీసులు వెన్నముకగా నిలుస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని న లుమూలలలో ఎక్కడ ఏ చిన్న నేరం జరిగినా నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకుని క్లిష్టమైన కేసులను సైతం వెను వెంటనే చేధిస్తూ నేరస్తు ల ఆట కట్టిస్తున్నారని అన్నారు. శాంతి భద్రతల ప రిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సింగపూర్, స్కాట్‌లాండ్, దుబాయ్ దేశాల తరహా లో స్థానిక పోలీస్ యంత్రాంగానికి అధునాతన స దుపాయాలను సమకూరుస్తుందని అన్నారు. ఇతరులకు వెలుగులు పంచుతూ కరిగిపోయే కొవ్వత్తి తరహాలో పోలీసులు పండుగల సమయంలోనూ తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ అనుక్షణం శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో నిమగ్నమై ఉం టున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి, డిఎస్పి, సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బ ంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News