Thursday, May 2, 2024

దారుణ యాప్‌ల కేసు : అదుపులో మరి ఏడుగురు

- Advertisement -
- Advertisement -

In the case of Online Loan apps

 

ఢిల్లీలో ఒక చైనా మహిళ అరెస్టు, ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్‌కు తీసుకురానున్న పోలీసులు
రూ.80కోట్ల ఖాతాలు ఫ్రీజ్, రూ.2 కోట్లు సీజ్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆన్‌లైన్ లోన్ యాప్ కేసులో శుక్రవారం నాడు బెంగళూరు, గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలకు చెందిన ఏడుగురు నిందితులను సిసిఎస్, సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ముగ్గురు నిందితులను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఆన్‌లైన్ కాల్ మనీ కేసులో హైదరాబాద్ పోలీసులు మరో ముఠాను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు చైనా వాసులు సహా నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2 కోట్లను సీజ్ చేశారు. అలాగే రెండు ల్యాప్ టాప్ లు, నాలుగు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నామని సిపి సజ్జనార్ మీడియా సమావేశంలో తెలిపారు. బెంగళూర్‌లోని రెండు కాల్‌సెంటర్లపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల దాడులు చేసి 42 లోన్ యాప్‌లను లీఫంగ్, పిన్ ప్రింట్, నబులోం, హాట్‌ఫుల్ టెక్నాలజీస్ సంస్థలు నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో కాల్‌మనీకి సంబంధించి 27 కేసులు నమోదు చేశారు. మైక్రో ఆన్‌లైన్ యాప్ రుణాలకు సంబంధించిన 350 అకౌంట్ల నుంచి డబ్బు జమ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా 350 అకౌంట్లకు సంబంధించి మొత్తం రూ.87 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.

అయితే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన నిందితులు చైనా వాసి డెన్నిస్ జియాజాన్గ్, ఉమాపతిలు పరారీలో ఉన్నట్లు సిపి తెలిపారు. కాగా జియాజాన్గ్ సింగపూర్ లో ఉన్నట్లు గుర్తించామని, అనతికాలంలో అతన్ని అదుపులోకి తీసుకుంటామన్నారు. అదేవిధంగా గూ ర్గావ్ కేంద్రంగా హైదరాబాద్‌లోని స్థానికులతో కలిసి రెండు డిజిటల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. గుర్గావ్ కేంద్రంగా స్థానికులు మైక్రో ఫైనాన్స్ దందా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి రుణాలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 11 యాప్ లు సృష్టించి రుణాలు ఇచ్చి ఈ దందా కొనసాగిస్తున్నారని వివరించారు. మైక్రో ఫైనాన్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్ కు లేఖ రాశామని, అలాగే 116 యాప్స్ ను డిలీట్ చేయాలని గూగుల్ కు లేఖ రాసినట్లు సజ్జనార్ తెలిపారు. మైక్రో ఫైనాన్స్ ఆన్ లైన్ యాప్ ల వెనుక చైనా హస్తం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

ఈ కేసులో చైనాకు చెందిన మహిళ ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో చైనా మహిళ ని అదుపులోకి తీసుకున్న అధికారులు ట్రాన్సిట్ వారంట్ మీద చైనా మహిళను హైదరాబాద్ కు తీసుకొని రానున్నారు. ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరులో హైదరాబాద్ కాల్ సెంటర్లను సదరు చైన మహిళ నేతృత్వంలో సాగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. కాగా చైనా మహిళ కి పూర్తి స్థాయిలో నాగరాజ్, మధుకర్ సహకరించారని, ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితుల కోసం దేశవ్యాప్తంగా గాలిస్తున్నారు పోలీసులు. ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంటే మరిన్నీ విషయాలు బయటపడనున్నాయని సిసిఎస్, సైబర్ క్రైం పోలీసులు భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News