సిరాజ్, ప్రసిద్ధ్ మ్యాజిక్
చివరి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి
2-2తో సిరీస్ సమం
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టెస్టులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. సోమవారం ఆఖరి రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాదీ సంచలనం మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లను తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించా డు. ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లతో జట్టు గెలుపులో తనవంతు సహకారం అందించాడు. చివరి టెసటులో ఉత్కంఠభరిత విజయం సాధించిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 22తో సమం చేసింది.
చివరి రోజు విజయం కోసం 35 పరుగులు అవసరం కాగా, ఈ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత్ సఫలమైంది. 339/6 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది. చివరి రోజు ఆట ప్రారంభమైన తొలి ఓవర్‌లోనే జేమీ ఒవర్టన్ రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఇంగ్లండ్ విజ యం లాంఛనమే అనిపించింది. కానీ సిరాజ్ వెంటవెంటనే జేమీ స్మిత్ (2), ఒవర్టన్ (9)లను ఔట్ చేశాడు. ఆ వెంటనే జోష్ టంగ్ (0)ను ప్రసిద్ధ్ కృష్ణ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ గెలిచినట్టే అని అందరూ భావించారు. గాయంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగని క్రిస్‌వోక్స్ అనూహ్యంగా క్రీజులోకి వచ్చాడు. దీంతో మ్యా చ్‌లో మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో సిరాజ్ బౌలింగ్ అట్కిన్సన్ సిక్స్ కొట్టడంతో ఇది తారాస్థాయికి చేరింది. అట్కిన్సన్ అద్భుత పోరా ట పటిమను కనబరచడంతో ఇంగ్లండ్ గెలుపు ఆశలు మళ్లీ చిగురించాయి. కానీ సిరాజ్ అద్భుత బంతితో అట్కిన్సన్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో భారత్ ఆరు పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సాధించింది.
భారత టెస్టు చరిత్రలోనే ఈ విజ యం చిరస్థాయిగా తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసిం ది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్, ప్రసిద్ధ్‌లు చెరో నాలుగు వికెట్లను పడగొట్టారు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. మ్యాచ్‌లో 9 వికెట్లు తీసి టీమిండియా గెలుపుతో కీలక పా త్ర పోషించిన సిరాజ్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో పరుగుల వరద పారించిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్‌లకు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో ఇంగ్లండ్, రెండో టెస్టులో భారత్ విజయం సాధించాయి. మూడో టెస్టులో మళ్లీ గెలిచింది. నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. తాజాగా ఐదో టెస్టులో భారత్ గెలవడంతో సిరీస్ సమంగా ముగిసింది.
ఊహించని విధంగా..
ఈ మ్యాచ్‌లో ఫలితం తరచూ చేతులు మారుతూ వచ్చింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అసాధారణ ఆటను కనబరిచింది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ధ సెంచరీలతో అలరించారు. దీంతో భారత్ ఆతిథ్య జట్టు ముందు 374 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జోరూట్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముం దుకు నడిపించారు.
బ్రూక్ (111), జో రూట్ (105) శతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ ఒక దశలో 301/3తో పటిష్ఠ స్థితిలో నిలిచిం ది. ఈ దశలో ఇంగ్లండ్ గెలుపు లాంఛనమేనని అందరూ భావించారు. కానీ భారత బౌలర్లు పట్టువీడకుండా పోరాడు. ఇటు సిరాజ్,అటు ప్రసిద్ధ్ కృష్ణలు అద్భుత బౌలింగ్‌తో చెలరేగి పోయారు. వీరి విజృంభణతో ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 339/6తో నిలిచింది. చివరి రోజు ఇంగ్లండ్ గె లుపు కోసం 35 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. కానీ సిరాజ్, ప్రసిద్ధ్‌లు చివరి రోజూ తమ జోరును కొనసాగించారు. స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుంటూ మిగిలిన నాలుగు వికెట్లను పడగొట్టారు. దీంతో భారత్ ఆరు పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.