Tuesday, September 10, 2024

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: చిరు, అల్లు, ఎన్ టిఆర్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవాలను దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఎక్కడా చూసిన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడిలో 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, ఎన్ టిఆర్, అల్లు అర్జున్ లు, తదితర నటులు ఎక్స్ లో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

స్వాతంత్రం కోసం మన పూర్వీకులు ఎంతో మంది పోరాటాలు, త్యాగాలు చేసుకున్నారని, వాళ్లనీ స్మరించుకుందామని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ జై హిందూ అని అన్నారు.

78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అని తెలిపారు. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 ఎడి విడుదలై 50 రోజులైన సందర్భంగా సినిమా యూనిట్ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ చేసినందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News