Thursday, May 2, 2024

హిమాచల్ ప్రదేశ్ రికార్డ్

- Advertisement -
- Advertisement -

 తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ కైవసం
 సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ అరోరా
జైపూర్: దేశవాళీ వన్డే క్రికెట్‌లో హిమాచల్ ప్రదేశ్ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో చాంపియన్‌గా నిలిచి సంచలనం రేపింది. డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడుతో ఆదివారం జరిగిన ఫైనల్లో విజెపి పద్దతి ప్రకారం 11 పరుగుల తేడాతో గెలుపొందిన హిమాచల్ ప్రదేశ్ తొలిసారి టైటిల్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ముం దుగా బ్యాటింగ్ చేసిన తమిళనాడు 49.4 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ కార్తీక్(103 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 116) సెంచరీతో చెలరేగగా.. బాబా ఇంద్రజిత్(71 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 80), షారూఖ్ ఖాన్(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) భారీగా పరుగులు పారించారు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో పంకజ్ జస్వాల్ 4 వికెట్లు పడగొట్టగా.. రిషీ ధావన్ 3 తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన హిమాచల్ ప్రదేశ్.. 15 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. 47.3 ఓవర్లలో 4 వికెట్లకు 299 పరుగులు చేసింది. బ్యాడ్ లైట్ కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో అంపైర్లు విజెడి పద్ధతిన 11 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్ గెలిచినట్లు ప్రకటించారు. శుభ్‌మన్ అరోరా(131 బంతుల్లో 13×4, సిక్స్‌తో 136 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రి షీధావన్(23 బంతుల్లో 5×4, సిక్స్‌తో 43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అమిత్ కుమార్(79 బంతుల్లో 6×4తో 74) హాఫ్ సెంచరీతో రాణించాడు. తమిళనాడు బౌలర్లలో వాషింగ్టన్ సుందర్.. రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, ము రగణ్ అశ్విన్, బాబా అపరజీత్ చెరో వికెట్ తీశారు.

Himachal Pradesh won Vijay Hazare Trophy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News