Thursday, May 2, 2024

సరిహద్దుల్లో మళ్లీ చైనా కవ్వింపు

- Advertisement -
- Advertisement -

India China tension in eastern Ladakh

తిప్పికొట్టిన భారత సైన్యం

న్యూఢిల్లీ : నెలలు తిరగకముందే సరిహద్దులలో పొరుగుదేశం చైనా తిరిగి గిల్లి కజ్జాలతో కబ్జాపర్వానికి యత్నించింది. ఈస్టర్న్ లడఖ్ లో తాజాగా ఈ డ్రాగన్ దేశపు సైన్యం పిఎల్‌ఎ భారీ స్థాయిలో కవ్వింపుల సైనిక చర్యలకు, కదలలికలకు దిగింది. వెంటనే అప్రమత్తం అయిన భారతీయ సైన్యం ఈ దూకుడును తిప్పికొట్టింది. దీనితో చర్చల మధ్య సద్దుమణిగిన సరిహద్దు ఉద్రిక్తతలు తిరిగి రాజకున్నాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఉన్నట్లుండి పాంగాంగ్ సో లేక్ దక్షిణ ఒడ్డున సరిహద్దుల యధాతథస్థితిని చెరిపివేసేందుకు యత్నించాయని , దీనిని భారతీయ సైన్యం విజయవంతంగా అడ్డుకుందని భారత సైనిక వర్గాల అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ సోమవారం ఓ ప్రకటన వెలువరించారు. చైనా ఇటీవలే గల్వాన్‌లో ఘర్షణకు దిగి, మన సైనికులను దొంగదెబ్బతీసింది.

తరువాత క్రమంలో ఇరుదేశాల మధ్య కుదిరిన సూత్రప్రాయపు అంగీకారాలను తుంగలోకి తొక్కి తన దురాక్రమణ వైఖరిని బయటపెటి్ంటంది. చైనా సైన్యం కదలికల్లో మార్పు రావడం, వారు ఈస్టర్న్ లద్ధాఖ్ ప్రాంతంలో ముందుకు వచ్చే వ్యవహారాన్ని తమ సేనలు వెంటనే గుర్తించినట్లు తక్షణం రంగంలోకి దిగి వారిని అడ్డుకున్నట్లు వివరించారు. ఈ మధ్యకాలంలోనే సైనిక దౌత్య వర్గాల స్థాయి సంప్రదింపుల దశలో కుదిరిన ఏకాభిప్రాయానికి అతి తక్కువ సమయంలోనే చైనా తూట్లు పొడిచింది. ఈ సర్దుబాటును ఉల్లంఘించి, సంఘర్షణకు కాలు దువ్విందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్తత కొనసాగుతోందని, అయితే ఈ నెల 29/30 తేదీ రాత్రి వేళలో చైనా సైనిక బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు తెలిపారు. పరిస్థితిపై బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. పరిస్థితిని సమీక్షించుకునేందుకు ఛూషుల్‌లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు , చైనా దూకుడును ఏ విధంగా అరికట్టాలనేది ఈ సందర్భంగా ఖరారు చేసుకోనున్నట్లు ఆనంద్ వివరించారు.

ఇప్పటివరకూ పాంగాంగ్ సరస్సు ఉత్తర దిశలో సైనిక కార్యకలాపాలకు యత్నించిన చైనా ఇప్పుడు తన వ్యూహం మార్చుకుని, భారతీయ సైన్యం ఏమరపాటుతో ఉంటుందనే ఆలోచనలతో ఇప్పుడు దక్షిణ దిశను ఎంచుకుని చర్యలకు దిగింది. అయితే ఈ ప్రక్రియను దాడిగా కాకుండా గుట్టుచప్పుడు కాకుండా కేవలం భూభాగాన్ని వశం చేసుకునే కుట్రగా నిర్థారించారు. ఓ దిక్కులో ఉద్రిక్తతలు పెంచి మరో వైపున ఇప్పటివరకూ ఉన్న సరిహద్దు రేఖలను చెరిపేసేందుకు చైనా బలగాలు ముందస్తు వ్యూహం పన్ని, అందుకు అనుగుణంగానే రాత్రి పూటను ఎంచుకుని ముందుకు సాగనట్లు నిర్థారించారు. ఈ ప్రాంతంలో వ్యూహాత్మక స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని చైనా ఈ కవ్వింపు చర్యలకు దిగినట్లు వెల్లడైంది. అయితే ఇప్పుడు దీనిని భారతీయ సైన్యం తిప్పికొట్టిందని సైనిక అధికారులు తెలిపారు. కానీ ఇరు సేనల మధ్య ఘర్షణలు జరిగినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఉభయ సేనల మధ్య పరస్పరం కొట్టుకునే పరిస్థితి తలెత్తిందని అనధికారికంగా వెల్లడైంది. కానీ అటువంటిదేమీ లేదని, మన భూభాగంపై చైనా తిరిగి కన్నేసింది , ఈ క్రమంలో రెచ్చగొట్టేందుకు యత్నించిందని, అంతకు మించి ఏమీ జరగలేదని సైనిక అధికారి ప్రకటించారు. గల్వాన్‌లో రెండు నెలల క్రితం ఘర్షణలకు కారణం అయిన సైనిక మొహరింపులను ఇప్పటికీ చైనా వెనకకు తీసుకోలేదు. కేవలం చర్చలతో కాలాయాపన చేస్తోంది.

పాంగాంగ్ వ్యూహాత్మక భౌగోళిక సరస్సు…

దాదాపు 134 కిలోమీటర్ల పొడవు ఉండే పాంగాంగ్ సరస్సు టబెబ్ వైపు 604 చదరపు కిలోమీటర్ల వరకూ ఉంటుంది. 5 కిలోమీటర్ల వెడల్పు ఉంటు ంది. ఇది 60 శాతం వరకూ టిబెట్ పరిధిలోకి వస్తుంది. ఈ సరస్సు సంబంధిత అత్యధిక ప్రాంతాన్ని కైవసం చేసుకుని తమ స్థావరాలను బలోపేతం చేసుకుని తీరాలని చైనా వ్యూహరచనలకు దిగుతోంది. ఈ క్రమంలో తరచూ ఈ ప్రాంతంలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సరస్సుకు ఉత్తర దిశలో బంజరు పర్వతాలు ఉన్నాయి. వీటిని ఫింగర్స్‌గా పిలుస్తారు. వీటి హక్కులకు సంబంధించే ఇరుదేశాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ వస్తున్నాయి. 1962లో చైనా భారత్‌పై దాడి చేసి అత్యంత కీలకమైన అక్సాయిచిన్‌ను కైవ సం చేసుకుంది. ఇప్పుడు తరచూ గిల్లికజ్జాల పర్వంతో ఈ కీలకమైన సరస్సు, పరిసరాల ప్రాంతాలను దక్కించుకుని తీరాలని సంకల్పించిందనే వాదనకు ప్రస్తుత చర్యతో బలం ఏర్పడింది. భారత్‌కు పూర్తి ఆధీనంలోని ఈ ప్రాంతపు ఫింగర్ 4 అత్యంత కీలకమైన భౌగోళిక పరిధిలో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News