Thursday, May 2, 2024

అతికష్టం మీద 24 మంది రాక

- Advertisement -
- Advertisement -
India evacuates 35 people from Kabul
కాబూల్ నుంచి భారత్‌కు చేరిక

న్యూఢిల్లీ: అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో పరిస్థితి దిగజారిన నేపథ్యంలో గురువారం 24 మంది భారతీయ పౌరులను, 11 మంది నేపాలీలను ఇక్కడికి చేర్చారు. ప్రత్యేక సైనిక విమానంలో వీరిని సురక్షితంగా తరలించేందుకు నానా ఇక్కట్లు పడాల్సి వచ్చిందని స్థానిక అధికారులు తెలిపారు. నిజానికి గురువారం 180 మంది ఇండియాకు చేర్చాల్సి ఉంది. కానీ వీరిలో ఇప్పుడు గురువారం కేవలం 35 మందినే తీసుకురాగలిగారు. వాయుసేనకు చెందిన సి 17 విమానం కాబూల్ ఎయిర్‌పోర్టులో ఎంతోసేపు వేచి ఉన్నా చాలా మంది భారతీయులు సకాలంలో కాబూల్ ఎయిర్‌పోర్టుకు చేరలేకపొయ్యారు. దీనితో గురువారం కేవలం 35 మంది కెపాసిటీతోనే విమానం తిరిగివచ్చింది. తాలిబన్ల ఆంక్షలు తీవ్రతరం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అతి తక్కువ మందితోనే సి 17 బయల్దేరిందనే విషయాన్ని గురువారం విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ ట్వీట్ ద్వారా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News