Tuesday, April 30, 2024

తోమర్, నామ్యలకు స్వర్ణాలు..

- Advertisement -
- Advertisement -

లిమా (పెరూ): ఇక్కడ ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో రెండు స్వర్ణాలు సాధించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిజన్ విభాగంలో భారత యువ షూటర్ ఐశ్వర ప్రతాప్ సింగ్ తోమర్ సరికొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అసాధారణ ప్రతిభను కనబరిచిన తోమర్ 463.4 పాయింట్లతో జూనియర్ ప్రపంచకప్‌లో కొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. ఇక ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్ బెర్నాడ్ రజతం, గావిన్ రెమాండ్ (అమెరికా) కాంస్య పతకాలు సాధించారు. ఇక మహిళల విభాగంలో భారత యువ సంచలనం నామ్య కపూర్ పసిడి పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో బరిలోకి దిగిన నామ్య అసాధారణ ఆటతో స్వర్ణం గెలుచుకుంది.

ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్‌లో పాల్గొన్న నామ్య 36 పాయింట్లతో పసిడి పతకాన్ని సాధించింది. కామిలి (ఫ్రాన్స్), మను బాకర్ (భారత్)లకు రజత కాంస్య పతకాలు లభించాయి. ఈ చాంపియన్‌షిప్‌లో మనుబాకర్, అరిబా ఖాన్, రైజా ధిలన్, సరోబ్‌జిత్ సింగ్, ధనుష్ శ్రీకాంత్, రాజ్‌ప్రీత్ సింగ్‌ల జోడీ స్వర్ణాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న ఆరంభమైన ఈ పోటీలు ఆదివారం ముగుస్తాయి.

India got 2 more gold at Jr shooting world championship

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News