బర్మింగ్‌హామ్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ (Ind VS Eng) రెండో ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. నాలుగో రోజు 64-1 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు కెఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని అందించాడు. కరుణ్ నాయర్‌తో కలిసి అతను మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే 21వ ఓవర్‌లో కరుణ్ నాయర్(26) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన గిల్.. నిలకడగా ఆడాడు. మరోవైపు కెఎల్ రాహుల్ 78 బంతుల్లో అర్థ శతకం సాధించి.. జోష్ టంగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కి వచ్చిన రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. నాలుగో రోజు భోజన విరామ సమాయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు (Ind VS Eng) 357 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం క్రీజ్‌లో గిల్ (24), పంత్ (41) ఉన్నారు.
లంచ్ బ్రేక్ సమయానికి భారత్ ఆధిక్యం ఎంతంటే..
- Advertisement -
- Advertisement -
- Advertisement -