Saturday, August 2, 2025

భారత్-యుకె ఎఫ్‌టిఎ ‘మేక్ ఇన్ ఇండియా’కు కొత్త శకం: టివిఎస్ మోటర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక బ్రిటన్ పర్యటన సందర్భంగా, భారత్-యుకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)పై సంతకం చేయడాన్ని టివిఎస్ మోటర్ కంపెనీ ఈరోజు స్వాగతించింది. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందం 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 60 బిలియన్ డాలర్ల నుండి 120 బిలియన్ డాలర్లకు చేస్తుందని భావిస్తున్నారు. ఇది ప్రధానమంత్రి వికసిత్ భారత్ లక్ష్య సాకారంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలువనుంది. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద, భారతీయ తయారీ మరియు డిజైన్ కోసం కొత్త ప్రపంచ సరిహద్దులను తెరవడానికి ఎఫ్‌టిఎ సిద్ధంగా ఉంది. టివిఎస్ మోటర్ కంపెనీకి సంబంధించి, ప్రతిష్టాత్మక బ్రిటిష్ బ్రాండ్‌ను వ్యూహాత్మకంగా కొనుగోలు చేసిన తర్వాత, యుకెలో నార్టన్ మోటర్‌సైకిల్స్ యొక్క కొత్త శ్రేణిని విడుదల చేయటానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ ఒప్పందం కీలక సమయంలో వస్తుంది.

ఈ ఎఫ్‌టిఎను స్వాగతించిన టివిఎస్ మోటర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోదీ యొక్క వికసిత్ భారత్ లక్ష్యం మరియు భారతదేశాన్ని ప్రపంచ తయారీ, డిజైన్ శక్తి కేంద్రంగా మార్చాలనే ఆయన అచంచలమైన నిబద్ధత మాకు ఎంతో ప్రేరణనిచ్చింది. ఇండియా -యుకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం ఒక కీలకమైన క్షణం. ఇది భారతీయ కంపెనీలు ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రపంచానికి తీసుకెళ్లడానికి కొత్త సరిహద్దులను తెరుస్తుంది. ఈ సంవత్సరం కొత్త నార్టన్ వాహనాలను విడుదల చేయనున్న సమయంలో ఇది జరగటం మాకు చాలా సంతోషంగా వుంది. ఇది భారతదేశం , యుకె మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా ప్రయోజనం పొందనుంది. ఇది మా ప్రపంచ ఆశయాలకు శక్తినిస్తుంది, ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, బ్రాండ్‌లను నిర్మించాలనే మా సంకల్పాన్ని బలపరుస్తుంది” అని అన్నారు.

ఇండియా -యుకె ఎఫ్‌టిఎ భారతీయ కంపెనీలు తమ ప్రపంచ కార్యకలాపాలను విస్తరించడానికి అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని, అదే సమయంలో భారీ వేదికపై దేశం ఆవిష్కరణ, ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని టివిఎస్ మోటర్ విశ్వసిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News