Thursday, May 2, 2024

వరుస సిక్స్ లతో చెలరేగిన రోహిత్.. సూపర్ ఓవర్ లో భారత్ విజయం

- Advertisement -
- Advertisement -

 

హామీల్టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగిన మూడో టీ20 సూపర్ ఓవర్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియాకు ఘన విజయాన్ని అందించాడు. సూపర్ ఓవర్ లో కివీస్ జట్టు, టీమిండియాకు 18 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బరిలోకి దిగిన ఓపెనర్లు రోహిత్(15), రాహుల్(5)లు చెలరేగి భారత్ కు మరిచిపోలేని విజయాన్ని అందించారు. సూపర్ ఓవర్ లోనూ ఉత్కంఠ తారాస్థాయికి వెళ్లింది. చివరి రెండు బంతులకు 12 పరుగులు సాధిస్తేనే భారత్ ను విజయం వరిస్తుంది.. లేదంటే, కివీస్ గెలుపొందుతుంది. ఇంతా ఉత్కంఠ పోరులో రోహిత్ వరుసగా రెండు భారీ సిక్స్ లతో విరుచుకుపడి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

అంతకుముందు టాస్ ఓడీ ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ(65), కెఎల్ రాహుల్(27)లు శుభారంభం అందించారు. అనంతరం క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ(38) రాణించినా.. మిగితావారు విఫలమయ్యారు. చివర్లో రవీంద్ర జడేజా(10), మనీశ్ పాండే(14)లు బ్యాట్ ఝుళిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(31), మన్రో(14)లు స్వల్ప స్కోరు వ్యవధిలో వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్(95) అద్భుత అర్థ సంచరీతో చెలరేగాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది. ఈ క్రమంలో కివీస్ జట్టు విజయానికి చివరి ఓవర్ లో 9 పరుగులు కావాలి. ఈ దశలో బౌలింగ్ వేసిన షమి.. 5 బంతుల్లో 8 పరుగులు ఇచ్చి విలియమ్సన్ వికెట్ పడగొట్టాడు. దీంతో చివరి బంతికి ఒక పరుగు అవసరం కావడంతో మరింత ఉత్కంఠ స్థాయికి వెళ్లిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి టేలర్ బౌల్డ్ కావడంతో మ్యాచ్ టై అయ్యింది.

https://help.twitter.com/using-twitter/how-to-tweet#source-labels

India win 3rd T20 against New Zealand in Super Over

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News