Friday, May 3, 2024

భారత కాన్సులేట్‌పై ఖలిస్థాన్ మద్దతుదారుల దుశ్చర్య

- Advertisement -
- Advertisement -

శాన్‌ఫ్రాన్సిస్కో : అమెరికా లోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆదివారం తెల్లవారు జామున భారత దౌత్య కార్యాలయానికి ఖలిస్థాన్ మద్దతుదారులు నిప్పంటించారు. అయితే స్థానిక అగ్నిమాపక విభాగం వేగంగా స్పందించి మంటల్ని ఆర్పేశారు. ఈ దాడిలో స్వల్ప ఆస్తి నష్టం జరిగింది.ఈ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది.

Also Read: ప్రతి బిజెపి కార్యకర్త రోజు గంట సమయాన్ని పార్టీకి కేటాయించాలి

దౌత్య కార్యాలయాలు, విదేశీ దౌత్యవేత్తలపై హింసకు పాల్పడడం వంటి చర్యలను అమెరికాలో తీవ్ర నేరాలుగా పరిగణిస్తామని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ట్వీట్ చేశారు. ఈ దుశ్చర్యకు సంబంధించిన వీడియోను ఖలిస్థాన్ మద్దతుదారులు విడుదల చేశారని, దీనికి ఎలాంటి ధ్రువీకరణ లేదని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ వీడియోలో హింస హింసను ప్రేరేపిస్తుందనే వ్యాఖ్యలతో పాటు ఇటీవల కెనడాలో మృతి చెందిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌కు సంబంధించిన వార్తా కథనమూ కనిపించింది.

Also Read: పోడు పట్టాలతో గిరిజనల జీవితాల్లో వెలుగులు

గత నెల కెనడా లోని ఓ గురుద్వారాలో నిజ్జర్‌ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గత మార్చిలో కూడా శాన్‌ఫ్రాన్సిస్కో దౌత్య కార్యాలయంపై దాడి జరిగింది. ఈ వరుస సంఘటనలపై సోమవారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. భారత్ భాగస్వామ్య దేశాలైన కెనడా, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఈ తరహా అతివాద భావ జాలానికి తావివ్వకూడదని , అది దేశాల మధ్య సంబంధాలకు మంచిది కాదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News