Friday, May 3, 2024

కొవాగ్జిన్‌కు డబ్ల్యుహెచ్‌ఒ గుర్తింపు కోసం భారత్ యత్నం

- Advertisement -
- Advertisement -

India's try for WHO recognition for Covaxin

 

న్యూఢిల్లీ : ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరోపా యూనియన్ ఇంకా గుర్తించక పోవడం భారత్‌కు అంతు పట్టడం లేదు. అత్యవసర వినియోగ జాబితాలో కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా చోటు కల్పించ లేదు. దీంతో ఎలాగైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం కోసం భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా, ఫైజర్, మోడెర్నా టీకాల ఉత్పత్తి సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడో ఇచ్చింది. దీంతో ఆయా సంస్థలు విదేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేయగలుగుతున్నాయి. అంతేకాదు వ్యాక్సిన్ల గ్రహీతలైన విదేశీ ప్రయాణికుల కోసం అనేక దేశాలు తమ సరిహద్దులను తిరిగి తెరవాలనుకుంటున్నాయి కూడా. అయితే కొవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులు తీసుకుని విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్లకు డబ్ల్యుహెచ్‌ఒ, ఐరోపా యూనియన్ క్లియరెన్సు లేక పోవడం ప్రతిబంధకంగ మారింది.

అందుకే స్వదేశీ వ్యాక్సిన్‌గా కొవాగ్జిన్ ఉండి పోయింది. ఏమాత్రం జాప్యం లేకుండా డబ్ల్యుహెచ్‌ఒ నుంచి గుర్తింపు రావాలని భారత్ ఆసక్తి చూపిస్తోంది. విదేశీ వ్యవహారాల ఉన్నత స్థాయి దౌత్య ప్రతినిధులు ఈ సమస్యను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా భారత్ బయోటెక్ అధికార వర్గాలను సోమవారం కలసి చర్చించనున్నారు. డబ్ల్యుహెచ్‌ఒ నుంచి కొవాగ్జిన్ వ్యాక్సిన్‌కు క్లియరెన్సు తప్పకుండావస్తుందని భారత్ బయోటెక్‌కు భరోసా ఇవ్వనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News