Saturday, September 20, 2025

మహిళలు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళలను కోటీశ్వరులను చేసేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని తెలంగాణ డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. మహిళలు కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, వివేక్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ లక్ష్యమని, మహిళలను ఇప్పటికే 150 ఆర్టిసి బస్సులకు యజమానులను చేశామని తెలియజేశారు.

మరో 450 ఆర్టిసి బస్సులకు మహిళలను యజమానులను చేయబోతున్నామని, మహిళలు ఇక వడ్డీవ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 7,422 కోట్లు చెల్లించిందని, 96 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందించామని అన్నారు. 41 వేల రేషన్ కార్డులు ఇచ్చామని, వడ్డీలేని రుణాలతో హిళలు వ్యాపారాలు చేయాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Also Read : రాజకీయాల్లో తొక్కుకుంటూ వెళ్లాల్సిందే: కవిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News