Saturday, July 27, 2024

ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలోని పేదలకు త్వరలోనే తెల్లరంగు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తామని రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గంలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తిరుమలాయపాలెం మండలం, మాదిరిపురంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గిరిజన మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాటాడుతూ.. పదవు లు, అధికారం శాశ్వతం కాదన్నారు. గత ప్రభు త్వ హయాంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇస్తాం అని చెప్పి వందల్లో మాత్రమే గత సిఎం కెసిఆర్ ఇచ్చారని, ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ఇ ళ్ళు ఇస్తామన్నారు. గడిచిన 80 రోజుల్లో ప్రభు త్వం ఏం చేస్తుందో అంతా చూస్తున్నారని, ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగు హామీలను అమ లు చేశామని, ఉచిత బస్సు పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల పథకం, గ్యాస్, ఉచిత వి ద్యుత్ పథకాలను ఇప్పటికే ప్రారంభించామని అన్నారు. మిగిలిన గ్యారెంటీలు కూడా అమలు చేస్తామన్నారు. ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో తప్పులు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర కార్యక్రమం అని తెలిపారు.

ధరణి పేరుతో గత ప్రభుత్వంలో వేలాది ఎకరాల భూములను కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో ధరణిలో ఇచ్చిన దరఖాస్తులను తిరిగి వెనక్కి పంపించారని అన్నారు. ధరణిలో వచ్చిన రెండు లక్షల నలభై ఐదు వేల దరఖాస్తులను
త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. మహిళలకు రూ. 2500 భృతిని త్వరలోనే పంపిణీ చేస్తామని, తాము ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని సరిదిద్దే పనిలో ఉన్నామని అన్నారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం రూ 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని ధ్వజమెత్తారు. గత పాలకులు ప్రాజెక్టులను చిత్తశుద్ధితో కట్టామని చెపుతున్నారు తప్ప.. చేసిన తప్పులను ఒప్పుకోవడం లేదన్నారు. ఈ సందర్బంగా తిరుమలాయపాలెం మండలంలో కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకం కింద ఎంపికైన 30 మంది లబ్ధిదారులకు మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు కూసుమంచి క్యాంపు కార్యాలయంలో 19 మంది కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ లబ్ధిదారులకు కూడా చెక్కులను పంపిణీ చేశారు. ఆ తరువాత ఖమ్మం రూరల్ మండలం, వెంకటగిరి గ్రామంలో రూ. 2.65 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గ్రీన్ ఫీల్ మినీ స్టేడియం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు .

ఈ సందర్బంగా ఖమ్మం రూరల్ మండల కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకం కింద ఎంపికైన 87 మంది లబ్ధిదారులకు కూడా మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 59వ డివిజన్ దానవాయిగూడెంలో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు, సైడ్ డ్రెయిన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా జిఓ 58 ద్వారా క్రమబద్ధీకరణ అయిన గృహాలకు ఇంటి నెంబర్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దినేని బేబి స్వర్ణ కుమారి, రాంరెడ్డి చరణ్ రెడ్డి, నరేశ్ రెడ్డి, మల్లారెడ్డి, డా శివరామక్రష్ణ, జెడ్‌పిటిసి బెల్లం శ్రీను, ఖమ్మం రూరల్ ఎంపిపి బెల్లం ఉమా, ఆయా మండల తహశీల్లార్లు, ఎంపిడివోలు, సర్పంచ్‌లు , ఎంపిటిసిలు, జెడ్‌పిటిసి సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News