Sunday, April 28, 2024

ఇండోనేసియా జలాంతర్గామి మిస్సింగ్

- Advertisement -
- Advertisement -

Indonesia submarine with 53 on board goes missing

53మంది నావీ సిబ్బంది గల్లంతు

జకార్తా: ఇండోనేసియా జలాంతర్గామి తప్పిపోయిన ఘటనలో నావీ విభాగానికి చెందిన 53మంది గల్లంతయ్యారని ఆ దేశ సైన్యం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. బాలీకి ఉత్తర ప్రాంతంలోని దీవిలో ఈ దుర్ఘటన జరిగిందని తెలిపింది. 95 కిలోమీటర్లమేర నీళ్లలో ప్రయాణించిన తర్వాత ఆచూకీ లేకుండా పోయిందని తెలిపింది. నావీకి చెందిన ఓడల ద్వారా గల్లంతైన ప్రాంతంలో గాలింపు చేపట్టినట్టు తెలిపింది. అందుకు సింగపూర్, ఆస్ట్రేలియా సహాయాన్ని కూడా ఆ దేశం కోరింది. ఆ దేశాలకు సబ్‌మెరైన్ రెస్కూ పరికరాలున్నాయి. 700 మీటర్ల లోతున జలాంతర్గామి మునిగిపోయి ఉంటుందని స్థానిక మీడియా చెబుతోంది. ఈ ఘటనలో గల్లంతైనవారంతా నావీలో శిక్షణ పొందుతున్నవారు. గురువారం ఆ ప్రాంతంలో క్షిపణి పరీక్షల నిర్వహణకు ఇండోనేసియా సిద్ధమైనవేళ ఈ దుర్ఘటన జరిగింది. ప్రాదేశిక జలాల విషయంలో చైనాతో వివాదాల నేపథ్యంలో ఇండోనేసియా తన అస్త్ర, శస్త్రాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం ఐదు సబ్‌మెరైన్లుండగా, వాటి సంఖ్యను 2024కల్లా 8కి చేర్చాలనేది లక్ష్యం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News