Friday, May 3, 2024

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అల్టిమేటం

- Advertisement -
- Advertisement -

Infosys
ముంబై: అనుమతి లేకుండా వేరే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకోడానికి వీల్లేదంటూ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ అల్టిమేటం జారీచేసింది. ఈ మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్ 12న ఈమెయిల్ పంపింది. ఉద్యోగుల హ్యాండ్‌బుక్, ప్రవర్తనా నియమావళి ప్రకారం రెండు ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతి లేదని తాకీదు ఇచ్చింది. నిబంధనను ఉల్లంఘించినవారిని తొలగించేస్తామని కూడా హెచ్చరించింది. ‘వర్క్ ఫ్రమ్ హోం’ విధానంలో ‘మూన్‌లైటింగ్’(ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు) ధోరణి పెరిగిందని ఇన్ఫోసిస్ పేర్కొంది. తమ అనుమతి లేకుండా వ్యాపార కార్యక్రమాలు లేక పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయడానికి వీలులేదని పేర్కొంది. మార్కెట్ పోటీ నేపథ్యంలో పెరుగుతున్న అట్రిషన్ ఇబ్బందులకు తోడు ఇప్పుడు ఐటి కంపెనీల్లో మూన్‌లైటింగ్ భయం పట్టుకుంది. 65 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారని కొటక్ సర్వేలో వెల్లడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News