Monday, May 6, 2024

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి

- Advertisement -
- Advertisement -

మధిర : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీకున రేపు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బందుకు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్‌ఐ మధిర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ తెలిపారు.ఈసందర్బంగా మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ జులై 12న రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టిన విద్యాసంస్థల బందుకు డివైఎఫ్‌ఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ప్రత్యక్షంగా పరోక్షంగా బందులో పాల్గొంటుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైన నెల రోజులు గడుస్తున్నా ఇంకా పాఠ్యపుస్తకాలు అందలేదని, అనేక స్కూల్స్‌లో మూత్రశాల సమస్యలు ఇంకా ఉన్నాయని, టీచర్స్ సమస్యతో కొన్ని స్కూల్ ఇబ్బంది పడుతుంటే, విద్యార్థులు లేక మరికొన్ని పాఠశాల మూసివేస్తున్న దుస్థితి కనపడుతుందని ఈ రెండిటికి ప్రభుత్వమె బాధ్యత వహించాలని ఆయన సందర్భంగా అన్నారు.

మరొక పక్క విచ్చలవిడిగా ప్రవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుమతులు ఇచ్చి, ఎటువంటి నిబంధన లేకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలకు మౌలి వసతులు కల్పించుకుండా మూసివేసే కుట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ కార్పొరేట్ సెమీ కార్పొరేట్ స్కూల్లో ఫీజుల మోత మోగిస్తున్నారని, విద్యా హక్కు చట్టం 2009 తుంగలో తొక్కి ఇష్టం వచ్చిన రీతిలో గవర్నమెంట్ బాడీ లేకుండా ఫీజు వసూలు చేస్తున్నారని, స్కూల్లోనే బుక్స్, షూస్ ఇతర సామాగ్రి ఎక్కువ రేట్లకు అమ్ముతూ తల్లిదండ్రులు మోసం చేస్తున్నారని వీటిపై నియంత్రం లేదని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీచరు పోస్టులు లెక్చర్ పోస్టులు ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయకుండా ఎలా విద్యాసంస్థలు బాగుపడతాయని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి న్యాయమైన డిమాండ్స్ కోసం జరుగుతున్న బందుకు డివైఎఫ్‌ఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని, ఈ బందుకు ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు స్వచ్ఛందంగా సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ టౌన్ కార్యదర్శి దోర్నాల విజయ్, కళ్యాణ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News