Monday, May 6, 2024

‘మాస్ట్రో’లో కొత్తగా కనిపిస్తా

- Advertisement -
- Advertisement -

Interview with Heroine Nabha Natesh

 

నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మాస్ట్రో. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్‌కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ మూవీని నిర్మించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… అంధాదున్ సినిమా విడుదలైనప్పుడు చూశాను. అది బాలీవుడ్‌కు టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా రీమేకే ‘మాస్ట్రో’. ఇది నా మొదటి రీమేక్ సినిమా. ఈ చిత్రంలో అంధుడిగా నితిన్ అద్భుతంగా నటించారు. సినిమా సీన్స్, సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఒరిజినల్ కథను మాత్రం తీసుకుని దర్శకుడు తన విజన్‌తో ఈ సినిమాను తీశాడు. నా పాత్రలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. ఇది పూర్తిగా తెలుగు చిత్రంలానే ఉంటుంది. కథలోని జీవం మాత్రం అలానే ఉంటుంది. నితిన్‌తో పని చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. ఎప్పుడు షూటింగ్ ప్రారంభించాం.. ఎప్పుడు పూర్తి చేశామో కూడా తెలియకుండా గడిచింది. మాస్ట్రోలో నేను కొత్తగా కనిపిస్తాను. భవిష్యత్‌తో ఇంకా కొత్త పాత్రలను చేయాలని అనుకుంటున్నాను, అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News