Friday, May 3, 2024

హోమ్ మినిస్టర్ కుమార్తెగా కనిపిస్తా

- Advertisement -
- Advertisement -

Interview with Tanya Ravichandran

 

కార్తికేయకు హీరోగా తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ’రాజా విక్రమార్క’. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ… శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ఇది. ఈ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్.ఐ.ఏ ఏజెంట్ పాత్రలో కార్తికేయ నటించారు. ఈనెల 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో తాన్యా రవిచంద్రన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నా పాత్ర పేరు కాంతి. కాలేజీకి వెళ్లే ఆమె హోమ్ మినిస్టర్ కుమార్తె. ఇక హీరో కార్తికేయ నటన చాలా నేచురల్‌గా ఉంటుంది. అతనితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ బావుంది. అతనితో పాటు సాయి కుమార్, తనికెళ్ల భరణితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. ఇక నేను సినిమా అంతా ఉంటాను. నాది చాలా ముఖ్యమైన పాత్ర. సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి మంచి సాంగ్స్ ఇచ్చారు. ఇక దర్శకుడు శ్రీ ఏదైతే కథ, సన్నివేశాలు చెప్పాడో… అదే తీశాడు. ఫిల్మ్ మేకింగ్ విషయంలో అతను ఏమాత్రం రాజీపడలేదు”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News