Monday, April 29, 2024

పలు రాష్ట్రాల్లోనూ తగ్గిన పెట్రో ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol And Diesel Price Drop in many states

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన 22 బిజెపి పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంకా దొరకని ఊరట

న్యూఢిల్లీ: దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లోం వేసేందుకు కేంద్రం వీటిపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించిన విషయం తెలిసిందే. పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీపావళి పండగ వేళ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు కొంత మేరకు ఉపశమనం కలిగించేదే కాగా, పలు రాష్ట్రాలు సైతం కేంద్రం బాటలో నడిచాయి. దాదాపు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆయా రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ వ్యాట్‌ను తగ్గించాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో రకంగా వ్యాట్‌ను తగ్గించాయి. అయితే ఒక్క ఒడిశా తప్ప వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలన్నీ కూడా బి జెపి, దాని భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే కావడం గమనార్హం. ఈ తగ్గుదల ఉత్తరాఖండ్‌లో అతి తక్కువగా ఉండగా, కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో అత్యధికంగా ఉండడం విశేషం. ఉత్తరాఖండ్‌లో పెట్రోల్‌పై లీటరుకు రూ.1.97లు తగ్గించగా, లడఖ్‌లో ఈ తగ్గుదల రూ.8.70 మేర ఉంది. ఉత్తరాఖండ్‌లో డీజిల్‌పై ఎలాంటి ఊరట ఇవ్వక పోగా లడఖ్‌లో రూ.9.52 మేర వ్యాట్‌ను తగ్గించారు.

ఉత్తరాఖండ్‌లో వ్యాట్ తక్కువగా ఉండడమే అక్కడ తగ్గింపులు తక్కువగా ఉండడానికి కారణం. వ్యాట్‌ను తగ్గించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కర్నాటక, పుదుచ్చేరి, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, గుజరాత్,దాద్రా, నాగర్ హవేలి, డామన్ డయ్యు, చండీగఢ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ, కశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా,లడఖ్ ఉన్నాయి. కర్నాటక ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.8.62, డీజిల్‌పై రూ. 9.40 తగ్గించగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.6.89, డీజిల్‌పై రూ.6.96 వ్యాట్ తగ్గించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.6.96, డీజిల్‌పై రూ.2.04 తగ్గించింది. కాగా వ్యాట్ తగ్గించని రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాజస్థాన్, పంజాబ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడుతో పాటుగా ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, టిఎంసి పాలనలు ఉన్న పశ్చిమ బెంగాల్, వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ, టిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న తెలంగాణ, వైఎస్‌ఆర్ పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

కాగా బిజూ జనతాదళ్ అధికారంలో ఉన్న ఒడిశా మాత్రం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3 మేర తగ్గించింది. ఈ తగ్గింపుల తర్వాత చాలా బిజెపి పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరు రూ.100 దరిదాపులకు చేరుకుంది. మరో వైపు రాజస్థాన్‌లో మాత్రం ఇప్పటికీ పెట్రోల్ ధర అత్యధికంగా లీటరు రూ.111.10గా ఉంది. ఇక ముంబయిలో రూ.109.98 ఉండగా, ఎపిలో రూ.109.05గా ఉంది.అలాగే రాజస్థాన్‌లో డీజిల్ ధర అత్యధికంగా రూ.95.71గా ఉండగా, ఎపి (రూ.95.18), ముంబయి (రూ.94.14) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిజోరాంలో డీజిల్ ధర లీటరుకు అతి తక్కువగా రూ.79.55 ఉండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News