Sunday, April 28, 2024

‘ఆర్‌ఆర్‌ఆర్’తో రియల్ జోరు

- Advertisement -
- Advertisement -

Land prices are rising with Regional Ring Road (RRR)

12 పట్టణాలు, 125 గ్రామాల్లో
పెరిగిన ప్లాట్ల, భూముల ధరలు

వేల నుంచి లక్షలకు చేరిక

వ్యవసాయ భూముల
ధరలు కోట్లలో

రానున్న రోజుల్లో మరింత
పెరిగే అవకాశం

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్-)తో రాకతో భూము ల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ కు సంబంధించి దక్షిణభాగం అధ్యయనం పూర్తి కావడంతో ప్లాట్లతో పాటు భూముల ధరలు అమాం తం పెరిగాయని రియల్‌వర్గాలు పేర్కొంటున్నా యి. ఆర్‌ఆర్‌ఆర్ పక్కనుంచి వెళ్లే గ్రామాల్లో సైతం ప్లాట్ల ధరలు లక్షలు పలకడం విశేషమని రియల్‌ఎస్టేట్ వర్గాలు తెలిపాయి. 12 పట్టణాలు, 125 గ్రామాల మీదుగా ఈ ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం జరగనుంది. ఔటర్ చుట్టూ 50 నుంచి 150 కి.మీల పరిధిలోని గ్రామాలు, పట్టణాల అభివృద్ధే లక్షంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అందు లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్‌ఆర్‌ఆర్ (344 కి.మీలను) ఆరు వరుస ల రహదారిగా(ఎక్స్‌ప్రెస్ హైవేగా) నిర్మిస్తున్నారు.

పూడుర్ మండలంలోని చాంగోమూల్‌లో ఎన్‌హెచ్-163…

ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో భాగం గా హైదరాబాద్- టు చేవెళ్ల హైవే దారికి ఇరువైపులా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 2 లైన్ల రహదారి కాస్త ఆరు లైన్లుగా అభివృద్ధి చెందనుండటంతో స్థలాల ధర లు వృద్ధి చెందుతున్నాయని రియల్‌వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఇక్కడ ఎకరం భూమి ధర రూ.40- నుంచి రూ.60 లక్షలు ఉండ గా ప్రస్తుతం ఆ ధర రూ.2.5- నుంచి రూ.3 కోట్లు పలుకుతుందని రియల్‌ఎస్టేట్ వ్యాపారులు తెలిపారు. రీజనల్ రింగ్‌రోడ్డు మొత్తం 344 కి.మీ లు కాగా పూడుర్ మండలంలోని చాంగోమూల్ గ్రామంలో ఎన్‌హెచ్-163 వద్ద ఈ రోడ్డు కలుస్తుంది. దీంతోపాటు తూప్రాన్, చౌటుప్పల్, ఆమన్‌గల్, శంకర్‌పల్లి, సంగారెడ్డి పట్టణాలను కలిపే నాలు గు లైన్లతో కూడిన రహదారి ఆర్‌ఆర్‌ఆర్‌తో అనుసంధానించాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రతిపాదించింది. దీంతో ఆయా ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపా రం పుంజుకుందని రానున్న రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్ అందుబాటులోకి వస్తే ప్లాట్ల ధరలే కోట్లలో పలుకుతాయని వారు పేర్కొంటున్నారు.

కొత్తరోడ్డు నిర్మాణంపై
కేంద్రం దృష్టి

రీజనల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగాన్ని కేంద్రం జాతీయ రహదారి కింద నిర్మిస్తోంది. ఈ భాగంలో ప్రతిపాదిత పట్టణాల ను అనుసంధానిస్తూ ఇప్పటి కే రోడ్లు ఉన్నాయి. వాటిమీదుగా పెద్ద సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీనిని ఆసరా చేసుకుని కొత్తరోడ్డు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగంలో ప్రతిపాదిత పట్టణాలు (చౌటుప్పల్-, ఇబ్రహీంపట్నం-, కందుకూరు-, అమన్‌గల్-, చేవెళ్ల-, శంకర్‌పల్లి-, కంది, -సంగారెడ్డి)లను అనుసంధానిస్తూ పెద్ద రోడ్లు లేవు. ఈ నేపథ్యంలో ఇక్కడి రోడ్లను కూడా పెద్దగా చేయడంతో పాటు అన్ని గ్రామాలకు కనెక్టివిటీని ఏర్పాటు చేస్తుండడంతో రియల్ వ్యాపారం మళ్లీ పుంజుకుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News