Tuesday, May 21, 2024

కోల్‌కతా‌పై ఢిల్లీ విజయం

- Advertisement -
- Advertisement -

IPL 2020: DC Won by 18 Runs against KKR

షార్జా: భారీ స్కోర్‌ల మధ్య ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ ముందుంచిన 229 పరుగు భారీ లక్ష ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ చివరివరకు పోరాడారు. రసెల్స్, మోర్గాన్, రాహుల్ త్రిపాఠీలు సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకు పడి జట్టును విజయానికి చేరువగా తీసుకు వెళ్ల్లారు. ఒక దశలో ఆ జట్టు విజయం సాధిస్తుందేమోనన్న ఆశలు కూడా కలిగాయి. అయితే కీలక సమయంలో మోర్గాన్, రాహుల్ తివారీ వెంటవెంటనే అవుటవడం, తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో తడబడడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. మోర్గాన్ 44 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠి 36 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ జట్టు మూడు విజయాలతో అగ్రస్థానంలో ఉంది.కోల్‌కతా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఢిల్లీ ఓపెనర్లలో శిఖర్ ధావన్ 26 పరుగులకే ఔటయినప్పటికీ మరో ఓపెనర్ పృథ్వీ షామాత్రం నాలుగు ఫోర్లు, నాలగు సిక్స్‌లతో చెలరేగి 66 పరుగులు చేశాడు. జట్టు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. రిషబ్ పంత్ 17 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇక జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిక్స్‌లు, ఫోర్లే లక్షంగా కోల్‌కతా బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఆరు సిక్స్‌లు, ఏడు బౌండరీలతో కేవలం 38 బంతుల్లోనే 88 పరుగులతో రాణించాడు. దీంతో ఢిల్లీ జట్టు భారీ లక్షాన్ని కోల్‌కతా ముందుంచింది. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్స్ రెండు వికెట్లు తీయగా, నగర్‌కోటి, వరుణ్ చక్రవర్తిలకు చెరో వికెట్ లభించింది.

IPL 2020: DC Won by 18 Runs against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News