Tuesday, May 7, 2024

IPL 2023: రాజస్థాన్‌కు లక్నో షాక్..

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జోరుకు లక్నో సూపర్ జెయింట్స్ బ్రేక్ వేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో పది పరుగుల తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. రాహుల్(39), మేయర్స్ (51) మాత్రమే రాణించారు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 144 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు యశస్వి (44), బట్లర్ (40) మాత్రమే రాణించగా మిగతా వారు విఫలమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News