Thursday, May 8, 2025

పంజాబ్-ఢిల్లీ మధ్య కీలక పోరు.. వర్షం కారణంగా టాస్ ఆలస్యం

- Advertisement -
- Advertisement -

PBKS vs DC: ఐపిఎల్ 2025లో భాగంగా ఇవాళ ధర్మశాల వేదికగా తలపడేందుకు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు సిద్ధమయ్యాయి. అయితే, కీలక పోరుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. స్టేడియం వద్ద వర్షం కురుస్తుండటంతో టాస్ ఆలస్యం కానుంది. ప్రస్తుతం వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ కారణంగా కొంతసమయం తర్వాత టాస్ వేయనున్నారు. కాగా, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న పంజాబ్, ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ జట్లు ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ స్థానాన్ని మెరుగు పర్చుకోవాలని భావిస్తున్నాయి.

జట్ల వివరాలు:

ఢిల్లీ జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (సి), ట్రిస్టాన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్

పంజాబ్ జట్టు: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (సి), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, నేహల్ వాధేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, సూర్యన్ష్ షెడ్జ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News