Thursday, May 2, 2024

రహదారి భద్రతకు ఐరాడ్

- Advertisement -
- Advertisement -

ఐఐటీమద్రాసు యాప్ రూపకల్పన

 IRAD-Integrated Road Accident Database

 

న్యూఢిల్లీ : రహదారుల ప్రమాదానికి కారణాలను విశ్లేషించడం, బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించడంపై ఐఐటీ మద్రాసు రూపొందించిన విధానాన్ని కేంద్రం ఆమోదించింది. దీన్ని 27 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాలు అమలు లోకి తెచ్చాయి. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డాటాబేస్ (ఐరాడ్ ) పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను ఐఐటి మద్రాసు రూపొందించింది. ప్రమాదం జరిగినప్పుడు ఆ వివరాలు, ఫోటోలు, వీడియోలను పోలీస్ అధికారులు మొదట దీంట్లో పొందుపరుస్తారు. దీనికి ప్రత్యేకంగా ఒక ఐడీ నెంబరు ఇస్తారు. అనంతరం సంబంధిత ఇంజినీరు సెల్‌కు సమాచారం అందుతుంది. వారు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి రోడ్డు నిర్మాణం లోని లోపాలు ఎంతవరకు కారణమన్న దాన్ని పరిశీలిస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే సమాచారాన్ని ఐఐటీమద్రాసులో విశ్లేషణ జరిపి తగిన సూచనలు ఇస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News