Tuesday, December 10, 2024

ఇజ్రాయెల్, అమెరికాలకు ఇరాన్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్షంగా చేసుకుని ఇ ఇజ్రాయెల్, అమెరికా ప్రతీకార దాడులకు పాల్పడటంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీఖమేనీ తీవ్రంగా ప్రతిస్పందించారు. తమ దేశంతోపాటు మిత్ర పక్షాలపై దాడులకు దిగితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ఇజ్రాయెల్, అమెరికాలను హెచ్చరించారు. అక్టోబర్ 26న తమ మిలిటరీ స్థావరాలు, తదితర ముఖ్యమైన ప్రాంతాలను లక్షంగా చేసుకుని చేసిన దాడులకు ఐదుగురు బలయ్యారని, ఇప్పుడు మరోసారి దాడులు చేయడానికి ఇజ్రాయెల్, అమెరికా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఖమేనీ మండిపడ్డారు. ఏవైపు నుంచి తదుపరి దాడులు జరిగినా విస్తృత మధ్యప్రాచ్యాన్ని చుట్టుముడుతుందని హెచ్చరించారు.

ఇప్పటికే గాజా లోని ఇజ్రాయెల్‌హమాస్ య్ధుం , లెబనాన్‌లో ఇజ్రాయెల్ భూతల దాడులు సాగుతున్నాయని , ఈ పరిస్థితుల్లో తదుపరి దాడులు మంగళవారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రాంతీయ సంఘర్షణకు భారీగా దారి తీస్తాయని హెచ్చరించారు. ఇరాన్, రెసిస్టెన్స్ ఫ్రంట్ విషయంలో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న పనులకు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని పేర్కొన్నారు. “ శత్రువులు, జియోనిస్టులు అయినా అమెరికా అయినా, ఇరాన్ , రెసిస్టెన్స్ ఫ్రంట్ విషయంలో వారు చేస్తున్న పనులకు తగిన ఫలితం అనుభవిస్తారు. మళ్లీ మాపై దాడులకు యత్నించిన వారిని కోలుకోలేని దెబ్బ కొడతాం ” అని ఖమేనీ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ చేసిన దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకోడానికి సిద్ధమవుతోంది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలైన తర్వాతే దాడి అమలు చేయాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News