Saturday, July 27, 2024

క్రికెట్‌కు ఇర్ఫాన్ పఠాన్ గుడ్‌ బై

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మ్యాచ్ విన్నర్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్ పలు మ్యాచుల్లో భారత్‌కు ఒంటిచేత్తో విజయం సాధించి పెట్టాడు. ట్వంటీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత బౌలింగ్‌తో భారత్‌కు ట్రోఫీని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక అంతర్జాతీయ క్రికెట్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. టెస్టులు, ట్వంటీ20, వన్డేల్లో భారత కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఇర్ఫాన్ కొనసాగాడు. ఇక, 2003లో ఇర్ఫాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. ఇక, ఇర్ఫాన్ చివరి సారిగా 2013లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్‌లో ఇర్ఫాన్ 120 వన్డేలు, 29 టెస్టులు, మరో 24 ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక, వన్డేల్లో 173, టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టాడు. ఇక, అంతర్జాతీయ కెరీర్‌లో 2821 పరుగులు సాధించాడు. వన్డేల్లో 1544, టెస్టుల్లో 1105 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇర్ఫాన్ జమ్మూ కశ్మీర్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

Irfan Pathan announced Retirement from All Formats

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News