Sunday, April 28, 2024

నగరంలో ఛాయా చంద్రగ్రహణం కనిపించదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  నగరంలోని ఖగోళ  శాస్త్రజ్ఞులు 2024లో కనిపించే అరుదైన ఛాయా చంద్రగ్రహణం కోసం కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఈ ఛాయా(పెనంబ్ర) చంద్రగ్రహణం ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాలలో కనిపించనున్నదని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) పేర్కొంది. దురదృష్టంకొద్దీ హైదరాబాద్ సహా భారత దేశంలోని అనేక నగరాలలో ఈ పెనంబ్ర చంద్రగ్రహణం కనిపించదు. ఈ పెనంబ్ర చంద్రగ్రహణం మార్చి 25న 10.23.16 గంటలకు మొదలవుతుంది. కాగా ఈ చంద్రగ్రహణం 15.02.27 గంటలకు ముగుస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News