Thursday, September 19, 2024

హమాస్ కమాండర్ ను వేటాడివేటాడి చంపేసిన ఇజ్రాయెల్ దళాలు

- Advertisement -
- Advertisement -

పాలస్తీనా భూభాగంలో కాల్పులు , బాంబు దాడుల్లో పాల్గొన్న హజెమ్, కారు ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించిన మరో ఇద్దరు హమాస్ ముష్కరులు హతమయ్యారు.

ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం జెనిన్ నగరంలో స్థానిక హమాస్ కమాండర్‌ను హతమార్చాయి. వారు వరుసగా మూడవ రోజు వెస్ట్ బ్యాంక్‌లో తమ విస్తృతమైన ఆపరేషన్‌ను కొనసాగించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసిన వీడియోలో వాసీమ్ హజెమ్‌ను తీసుకువెళుతున్న వాహనం లక్ష్యంగా చేసుకున్నట్లు చూయించింది. పాలస్తీనా భూభాగంలో కాల్పులు , బాంబు దాడుల్లో పాల్గొన్న హజెమ్, కారు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన మరో ఇద్దరు హమాస్ ముష్కరులతో సహా మరణించారు. డ్రోన్ స్ట్రైక్, కెమెరాకు చిక్కింది. వార్తా సంస్థ ‘రాయిటర్స్’ రిపోర్టు ప్రకారం, హమాస్ కమాండర్‌ను తీసుకువెళుతున్న వాహనం, తరువాత కాలిపోయినట్లు కనిపించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News