Monday, October 14, 2024

ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సంచలనం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : తన జీవిత కథ పుస్తక విడుదలను నిలిపివేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శనివారం ప్రకటించారు. ఆయన నిలవు కుడిచ సింహర్ శీర్షికతో ఆత్మకథ పుస్తకం రాశారు. దీని అర్థంవెన్నెలను తాగుతున్న సింహాలు. అయితే ఇందులో కొందరిపై వ్యక్తిగత విమర్శలు ఉన్నాయని వాదనలు బయలుదేరడంతో ఈ వరుస అంతరిక్ష విజయాల ఘనత వహించిన సోమనాథ్ అర్థాంతరంగా ఈ పుస్తక విడుదలకు బ్రేక్ వేస్తున్నట్లు వెల్లడించారు. ఆత్మకథలోని అంశాలు, ఇతివృత్తంపై వివాదం రగులుకుంది. ఈ వివాదాలు తనకు కుదరవని తెలిపిన సోమనాథ్ పుస్తక విడుదలను నిలిపివేసినట్లు తెలిపారు.

కేవలం యువతను ప్రోత్సహించేందుకు ఈ పుస్తకం తీసుకువచ్చినట్లు , అయితే ఇదులోని అంశాలు కొన్ని ఇస్రో మాజీ ఛైర్మన్ తన పూర్వపు బాస్ కె శివన్‌కు ఇబ్బందికరంగా మారినట్లు వార్తలు వెలువడ్డాయని, దీనికి తాను చింతిస్తున్నానని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. మలయాళం భాషలో ఈ పుస్తకం రూపొందించారు. ఇప్పటికే కేరళలో ఈ పుస్తక ప్రతులు కొన్ని వెలువడ్డాయి. ఇస్రో ఛైర్మన్ పదవికి తనకు పూర్వపు ఛైర్మన్ శివన్ నుంచి అడ్డంకులు ఎదురయ్యాయని సోమనాథ్ ఇందులో విమర్శించారు. ఇప్పటికే మార్కెట్‌లోకి వెలువడ్డ పుస్తకాలను వెనక్కు తీసుకుంటామని, రిలీజ్ ఉండదని వివరించారు.

యువతకోసమే పుస్తకం., ఎవరూ టార్గెట్ కాదు
ఎవరినో టార్గెట్ చేసుకుని తాను ఈ పుస్తకం తీసుకురాలేదని, నేటి యువతరానికి శాస్త్ర విజయాలను స్ఫూర్తి వంతంగా తెలియచేసేందుకు దీనిని తెచ్చానని చెప్పారు. అధికారికంగా ఈ పుస్తకం విడుదల కాలేదు. అయితే ప్రచురణకర్తలు కొన్ని ప్రతులను కొందరికి ఇచ్చినట్లు తెలిసింది. వెంటనే ఇందులోని అంశాలు శివన్‌ను కించపరిచేవిగా ఉన్నాయని ప్రచారం జరిగింది. తాను వెంటనే పబ్లిషర్స్‌తో మాట్లాడినట్లు విడుదలను నిలిపివేయాలని తెలిపినట్లు సోమనాథ్ చెప్పారు. పుస్తకంలోని అంశాలు కొన్ని వక్రీకరణకు గురయ్యాయి. ఇది విచారకరం, పుస్తక ప్రచురణ వెనుక ఉద్ధేశం కేవలం ఇతరులకు స్ఫూర్తివంతంగా ఉండేందుకు, అంతేకానీ అనవనరపు వివాదాల కల్పనకు కాదని సోమనాథ్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే పుస్తక విడుదల ఆగినట్లే, ఇక ముందు రిలీజ్ ఉంటుందా? మొత్తానికే దీనిని వెనకకు తీసుకోవాలా? అనేది తరువాత నిర్ణయించుకుంటానని వివరించారు.

వృత్తిపరమైన సవాళ్లను ప్రస్తావించా ఇతరులు బాధపడితే చింతిస్తున్నా
ఓ వృత్తిని ఎంచుకున్నప్పుడు అందులో ఎదురయ్యే సవాళ్లను, వాటిని ఎదుర్కొనే స్థయిర్యాన్ని వివరించే ప్రయత్నం చేశానని, ఇతరులను నిందించేందుకు కాదని తెలిపారు. తనకు వచ్చిన అవకాశాలను కొందరు దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని ఇందులో తాను రాసినట్లు ప్రచారం జరిగింది. ఇది వాస్తవం కాదు. అయినా జీవితంలో ఎవరికైనా అందే అరుదైన ఛాన్స్‌లను ఇతరులు ఎవరూ తన్నుకుపోయే ప్రసక్తే ఉండదు. ఈ విధంగా జరిగితే వాటిని చేజార్చుకున్న వ్యక్తి విఫలుడు అయినట్లే అని సోమనాథ్ తెలిపారు. పుస్తకంలో కొన్ని విషయాలను నిర్మోహమాటంగా తెలియచేయాల్సి వచ్చింది. ప్రత్యేకించి చంద్రయాన్ 2 వైపల్యం గురించి ప్రస్తావించానని నిజానికి ఇది విజయవంతం కావల్సిన ప్రయోగం , విఫలం అయింది.

లోపాల గురించి పారదర్శకంగా చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. ఆయన (శివన్ ) ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తనకు సరైనవి అనుకున్న నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాధికారం ఆయనకు ఉండనే ఉంటుంది. అయితే ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారని విశ్లేషించడం జరిగింది.ఈ విషయం తనకు సంబంధించింది. అయితే దీని వల్ల ఆయన నొచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా జరుగుతుందని తనకు తెలుసునని కానీ కొన్ని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా జరిగినదానికి స్పందిస్తూ ఈ పుస్తకం విడుదలను విరమించుకుంటున్నట్లు ఇటీవలి చంద్రయాన్ 3 విజయంతో ప్రశంసలు పొందిన సోమనాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News