Friday, May 3, 2024

బిజెపి కుట్రలో భాగమే ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : కేంద్రంలోని బిజెపి కుట్రలో భాగమే నా వ్యాపారాలపై ఐటి దాడులు జరిగాయని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఈ నెల 14వ తేది ను ంచి నాలుగు రోజుల పాటు వరుసగా ఐటి అధికారుల సోదాల అనంతరం మంగళవారం ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు తిమ్మాజిపేట మండలం మర్రికల్ నుంచి వందలాది వాహనాలతో భారీ కాన్వాయ్‌తో స్వాగతం పలికారు.

తిమ్మాజిపేట, బిజినేపల్లి, నాగర్‌కర్నూల్ వరకు అడుగు అడుగున ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిపై పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు. బిజెపికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంట ల వరకు సాగిన ఈ ర్యాలీలో వేలాదిగా తరలివచ్చి మర్రి జనార్ధన్ రెడ్డికి అండగా ఉన్నామని నినాదించారు. అనంతరం నాగర్‌కర్నూల్ బస్టాండ్ కూడలిలో భారీ క్రేన్ సహాయంతో గజమాలతో పట్టణ బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ నియోజకవర్గం తొమ్మిదేళ్లలో కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిందని మర్రి జనార్ధన్ రెడ్డి సామాజిక సేవతో ప్రజల మన్ననలు పొందుతున్నాడన్న అక్కసుతో ఎలాగైనా అప్రతిష్టపాలు చేయాలన్న కుటిల నీతితో బిజెపి, కాం గ్రెస్ పార్టీలు కొంతమంది జతకట్టారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

మెడికల్ కళాశాల, నాగర్‌కర్నూల్ జిల్లా ఏర్పాటు, జిల్లా కార్యాలయాల సముదాయాలు, కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చె ందుతున్నారని ఓర్వలేకపోతున్నారన్నారు. 40 ఏ ళ్లుగా నాగర్‌కర్నూల్‌లో రాజకీయాలు చేస్తున్నవా రు ఈ ప్రాంత ప్రజల కోసం ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. 9 ఏళ్లలో అభివృద్ధి జరిగిందని మర్రి ఉంటే మా పప్పులు ఉడకవన్న కారణంతో రాజకీయంగా ఎదుర్కొలేక దొంగదెబ్బ తీయ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. స్థానికంగా బిజెపి, కా ంగ్రెస్ పార్టీలకు ప్రజల నుంచి సహకారం లేకపోవడంతో మంచి చేస్తున్న నాపై నిందలు మోపడానికి జత కట్టి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

భయపెట్టి బిజెపిలో చేర్పించుకోవడానికి ఆ పార్టీ నాయకత్వం ఇలాంటి దాడులకు దిగుతుందని దుయ్యబట్టారు. నేను భయపడేది నియోజకవర్గ ప్రజలకే తప్ప ఏ పార్టీకో, వ్యక్తులకో భయపడేది లేదని మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. మీ ఆదరాభిమానాలు ఉన్నంతకాలం నన్ను ఎదిరించే శక్తి ఏ పార్టీకి లేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గ సరిహద్దు నుం డి భారీ వాహనాల కాన్వాయ్‌తో అం డగా నిలుస్తూ మీ వెంట మేమున్నామని కలిసి నడుస్తున్న ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, గ్రంథాలయ చై ర్మన్ హనుమంత రావు, మాజీ మార్కెట్ కమిటీ చై ర్మన్ దొడ్ల ఈశ్వర్ రెడ్డి, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News