Monday, April 29, 2024

కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నేలా సర్కార్ బడులు

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ విద్యాదినోత్సవం సందర్భంగా దమ్మపేట మండ లం, జగ్గారంలో, పార్కలగండిలో మొత్తం సుమారు 84 లక్షల రూపాయల మన ఊరు, మన బడి అభివృద్ది కార్యక్రమాలను మంగళవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు రెండు గ్రామా ల ప్రజలు ఘన స్వాగతం పలికారు. చిన్నారులు సైతం ఎమ్మెల్యేకి పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సమయాన్ని గడిపారు. పిల్లలకు డిపార్ట్ మెంట్ వారి సహకారంతో స్కూల్ బ్యాగ్ లు అందజేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. అనంతరం పాకలగూడెం గ్రామంలో గల అంగన్‌వాడి సెంటర్‌ని సందర్శించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, ఎంఈఓ, ఎంపిడిఓ, ఈఈ, ఎంపిటిసిలు, మండల నాయకులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్‌లు, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News