Friday, May 3, 2024

భగ్గుమన్న బోనగిరి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: అధికార పార్టీకి చెందిన (బీఆర్ఎస్) భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో గత మూడు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతుండటంతో, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో, ఆఫీస్ లో ఐటీ సోదాలు కొనసాగుతుండటంతో రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డినీ అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రాజకీయ కక్షతో అణచివేయాలని చూస్తోందని భువనగిరి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు నిరాశాన కార్యక్రమాలు నిర్వహించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంటి, ఆఫీస్ లపై చేయిస్తున్న ఐటీ దాడులను నిలిపి వేయాలని, బీజేపీ డౌడౌ, నరేంద్ర మోడీ డౌడౌ అంటూ నినాదాలు చేశారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి జోలికొస్తే ఊరుకోబోమని హచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన నిరాశాన కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఐటీ దాడులు ఆపాలంటూ హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై నిరాశాన వ్యక్తం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేశారు.

ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అమరేందర్ గౌడ్, రైతు సమితి అధ్యక్షులు అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, భువనగిరి మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, నీల ఓం ప్రకాష్ గౌడ్, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, జడ్పీటిసి సుబ్బూరు బీరు మల్లయ్య, కంచి మల్లయ్య, పీఏసిఎస్ చైర్మన్ పరమేశ్వర్, వైస్ చైర్మన్ కేతావత్ మహేందర్ నాయక్, నాయకులు జెక్క కవిత రాఘవేందర్ రెడ్డి, బల్గూరి మధుసూదన్ రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, గుండెబోయిన సురేష్ యాదవ్, పుట్ట వీరేశం, గాదె శ్రీనివాస్, సుభాష్, పాండు, వివిధ గ్రామాల అధ్యక్షులు, సర్పంచ్, ఎంపిటిసి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News