Wednesday, May 8, 2024

నటుడు సోనూ సూద్ ఆస్తులపై ఐటి నిఘా

- Advertisement -
- Advertisement -

ముంబయి: నటుడు సోనూ సూద్‌కు చెందిన ముంబయి, లక్నోలోని ఆరు ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సర్వే చేపట్టారని పిటిఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే దీనిని ఐటి దాడులుగా మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. సోనూ సూద్ ఇంటిని సైతం ఐటి అధికారులు సందర్శించారా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఓ రియల్ ఎస్టేస్ డీల్ కూడా ఐటి శాఖ నిఘాలో ఉన్నట్లు సమాచారం. కోవిడ్-19 మహమ్మారి కాలంలో బాధిత ప్రజలకు సాయం చేసినందుకు ఢిల్లీ ప్రభుత్వం మానవతా ప్రశంసలు అందుకున్న తర్వాత ఆయన ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన వెంటనే ఆయన ఐటి నిఘాలోకి వచ్చారు. ఐటి శాఖ ఈ చర్యను సోనూ సూద్‌పై కక్షపూరిత చర్యగా ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రతినిధి రాఘవ్ ఛద్దా అభివర్ణించారు. సోనూ సూద్ చేసిన నేరమల్లా ఆయన అనాథులైన ప్రజలపక్షం నిలవడమేనన్నారు. ఆయన నిజజీవితపు హీరో అని, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం సైతం ఆయనకు ప్రత్యేక మానవత చర్య అవార్డును ఇచ్చి సత్కరించిందన్నారు. భారత్‌లో కోవిడ్ రెండో వేవ్ తీవ్రదశలో సోనూ సూద్ ఆక్సిజన్ సరఫరాను కూడా చేపట్టారన్నారు.
ఐటి సర్వేను ఆప్ ఎంఎల్‌ఎ ఆతిషి సైతం ఓ విడియో ప్రకటన ద్వారా విమర్శించారు. దేశంలో ఎవరైనా ఓ మంచి పనిచేస్తే వారిని బిజెపి బలిపశువులను చేస్తుందనే సందేశాన్ని ఇస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ‘లాక్‌డౌన్ సమయంలో ప్రవాస కార్మికులకు సాయపడ్డమే సోనూ సూద్ చేసిన నేరమా?’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News