- Advertisement -
జగిత్యాల: అతిగా అశ పడితే అది కష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ విషయాన్ని తెలుసుకోకుండా చాలా మంది అత్యాశకు పోయి తిప్పలు పడుతుంటారు. అలాంటి వారిని చూసిన కొంతమందిలో మార్పు రాదు. ముఖ్యంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి విషయాలకు కచ్చితమైన ఉదాహరణ అలాంటి వ్యక్తే జగిత్యాల డిటివొ భద్రునాయక్. ఇతడు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. జెసిబిని వదిలిపెట్టేందుకు శశిధర్ అనే వ్యక్తి నుంచి రూ.22 వేలు లంచం తీసుకుంటూ భద్రునాయక్ ఎసిబి అధికారులకు దొరికిపోయాడు. ఇందులో వింతేమిటంటే.. ఈ నెలాఖర్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈలోపే అత్యాశపడటంతో చిక్కుల్లోపడ్డారు. భద్రునాయక్‌ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
- Advertisement -