Tuesday, May 21, 2024

స్థానికులకు లీజుపై భూమి పథకం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో భూమిలేని వారికి భూమి పథకం అమలులోకి వచ్చింది. కేంద్రపాలిత ప్రాంతపు నివాసితులే అర్హులుగా వీలు కల్పిస్తూ భూమిలేని వారికి భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించడం ఈ పథకం ఉద్ధేశం. దీనికి జెకె అధికార యంత్రాంగం ఇప్పుడు అధికారికంగా ఆమోదం తెలిపింది. నిజానికి సంబంధిత పథకాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జులైలోనే ప్రారంభించారు. అయితే కశ్మీర్ లోయలోని రాజకీయ పార్టీలు ఈ పథకం తీరుతెన్నులపై విమర్శలకు దిగాయి. ఈ పథకంలో లబ్ధిదారులు ఎవరనేది స్పష్టత లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనితో కేంద్రపాలిత ప్రాంత డొమిసిల్ పత్రం ఉన్నవారికి ఈ పథకం వర్తింపచేస్తారని అధికార యంత్రాంగం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News