బెంగళూరు: ఓ బాలుడు వెబ్ సిరీస్ వీక్షించి అనంతరం సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని చెన్నమ్మకేరే అచుకట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 14 సంవత్సరాల గాంధార్ అనే బాలుడు ఎక్కువగా వెబ్ సిరీస్ లు వీక్షించేవారు. బాలుడి జపనీస్ వెబ్ సిరీస్ లు ఇష్టంగా టివిలో చూసేవాడు. అతడు తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసిమెలిసి ఉండేవాడు. పెంపుడు కుక్కతో రాత్రి నిద్రలోకి జారుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు తన రూమ్ లో నిద్రకు ఉపక్రమించారు. అనంతరం బాలుడు తన రూమ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు మర్నాడు రూమ్ కు వెళ్లేసరికి విగతజీవిగా కనిపించాడు. బాలుడి మృతదేహం పక్కన సూసైడ్ నోటు ఉంది. గత 14 సంవత్సరాల నుంచి అమ్మానాన్నలు మంచిగా పెంచారని, తల్లిదండ్రుల పెంపకంతో చాలా సంతోషంగా ఉన్నానని, ఈ లోకాన్ని విడిచి వెళ్లే సమయం ఆసన్నమైందని, తల్లిదండ్రులు ఈ లేఖ చదివే సమయానికి తాను స్వర్గంలో ఉంటానని సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. చెడ్డవాళ్లు ఈ లోకం విడిచి వెళ్లాలని రాస్తే అలాగే జరుగుతుందని లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటన పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. బాలుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.