Wednesday, May 8, 2024

సన్‌రైజర్స్‌లోకి జాసన్ రాయ్

- Advertisement -
- Advertisement -

Jason Roy into Sunrisers Hyderabad

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్‌కు ఐపిఎల్‌లో ఆడే ఛాన్స్ దక్కింది. వేలం పాటలో నిరాదారణకు గురైన రాయ్‌కు ఎట్టకేలకు ఐపిఎల్‌లో ఆడే అవకాశం లభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ జాసన్ రాయ్‌ను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిఛెల్ మార్ష్ స్థానంలో రాయ్‌కు చోటు దక్కింది. వ్యక్తిగత కారణాలతో మిఛెల్ మార్ష్ ఈసారి ఐపిఎల్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో రాయ్‌ను సర్‌రైజర్స్ తీసుకుంది. ఇటీవల భారత్‌తో జరిగిన టి20, వన్డే సిరీస్‌లో రాయ్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. అద్భుత ఫామ్‌లో ఉన్న రాయ్ చేరికతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ మరింత బలంగా మారింది. కాగా, రాయ్‌ను తీసుకున్న విషయాన్ని సన్‌రైజర్స్ యాజమాన్యం బుధవారం అధికారికంగా ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News