Friday, May 3, 2024

24 నుంచి జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ మెయిన్) పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి 31 వరకు జరగనున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడే జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు(హాల్ టికెట్లు) బుధవారం లేదా గురువారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అడ్మిట్ కార్డుపై పరీక్షా కేంద్రం, తేదీ, షిఫ్ట్ వంటి వివరాలు ఉంటాయి. విద్యార్థులు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే jeemain@nta.ac.inకు ద్వారా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ)కు ఈమెయిల్ చేయవచ్చు. ఈ నెల 24,25,27,28,29,30,31 తేదీలలో జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్ష జరగనుంది.
ఫిబ్రవరి 7 నుంచి రెండో విడత దరఖాస్తులు
జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్ష కోసం విద్యార్థులు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌టిఎ ఇప్పటికే ప్రకటించింది. రెండో విడత పరీక్ష ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహించే నగరాల జాబితాను మార్చి మూడో వారంలో, అడ్మిట్ కార్డులను మార్చి చివరి వారం నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఈ నెల 24 నుంచి జెఇఇ మెయిన్ 2023 తొలి విడత, ఏప్రిల్‌లో రెండో విడత ఉంటుంది. ఒక విద్యార్థి ఈ రెండు పరీక్షలకూ హాజరుకావచ్చు. ఏ పరీక్షలో మార్కులు ఎక్కువగా వస్తే ఆ మార్కులనే అడ్మిషన్ సమయంలో పరిగణలోకి తీసుకుంటారు. జెఇఇ మెయిన్‌కు దేశవ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News