Sunday, May 5, 2024

వలస విధానంలో మార్పులకు బైడెన్ కట్టుబడి ఉన్నారు: వైట్‌హౌస్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: వలస విధానంలో మార్పుకు అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ట్రంప్ హయాంలో అనుసరించిన విభజన, అమానవీయ, అనైతిక విధానాలను మార్చడంపైనే బైడెన్ దృష్టి సారించారని ఆ ప్రతినిధి తెలిపారు. అందులో భాగంగానే అథికారం చేపట్టిననాటి నుంచి జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాలని పేర్కొన్నారు. హెచ్1బి వీసాల విషయంలో లాటరీ పద్ధతిని పునరుద్ధరిస్తూ ఇటీవలే జోబైడెన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గత ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన వీసాల విధానాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31వరకు వాయిదా వేస్తున్నట్టు బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డుల విషయంలోనూ పరిమితిని తొలగించాలని బైడెన్ ప్రభుత్వానికి ఇమ్మిగ్రేషన్ వాయిస్ అధ్యక్షుడు అమన్‌కపూర్ విజ్ఞప్తి చేశారు. పరిమితి వల్ల లక్షలమంది గ్రీన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఓ పరిశోధక సంస్థ అంచనా ప్రకారం ఇప్పుడు వెయిటింగ్ జాబితాలో ఉన్నవారందరికీ గ్రీన్‌కార్డులు ఇవ్వాలంటే 195 ఏళ్లు, 2030 వరకు జాబితాలో చేరే వారితో చూస్తే 436 ఏళ్లు పడుతుంది.

Joe Biden clear about Immigration System: White House

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News