Wednesday, May 15, 2024

బ్రిటన్‌లో జాన్సన్ టీకాకు ఓకె

- Advertisement -
- Advertisement -

Johnson vaccine approval in Britain

లండన్ : బ్రిటన్‌లో సింగిల్ డోస్ మోతాదు జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ వాడకానికి శుక్రవారం అధికారిక అనుమతిని ఇచ్చారు. ఈ విషయాన్ని అక్కడి ఔషధాలు, ఆరోగ్యపరిరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్‌ఆర్‌ఎ) తెలిపింది. దేశంలో అత్యంత విజయవంతం అయిన వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హ్యాన్‌కాక్ తెలిపారు. వ్యాక్సిన్ల ప్రక్రియతో ఇప్పటికే 13 వేల మంది ప్రాణాలను రక్షించినట్లు వివరించారు. దీనిని మరింత సమర్థవంతం చేసేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. రెండు కోట్ల జాన్సన్ టీకాకోసం బ్రిటన్ ఆర్డర్లు వెలువరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News